జడ్జీలు బోధనలు చేయరాదు

Published on Sat, 12/09/2023 - 05:52

న్యూఢిల్లీ: కౌమార బాలికలు లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని, బాలురు మహిళలను గౌరవించడం అలవర్చుకోవాలంటూ కలకత్తా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇటువంటి తీర్పు ఎంతో అభ్యంతరకరం, అవాంఛనీయమని పేర్కొంది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం కౌమార వయస్కుల హక్కులను పూర్తి స్థాయిలో ఉల్లంఘించడమేనని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ల ధర్మాసనం పేర్కొంది.

‘సంబంధిత అప్పీల్‌లో న్యాయపరమైన అంశాలను పరిశీలించాలే తప్ప,న్యాయమూర్తులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరచరాదని, బోధనలు చేయరాదని ప్రాథమికంగా మేం భావిస్తున్నాం’అని తెలిపింది. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి, సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసింది.

సీనియర్‌ న్యాయవాది మాధవి దివాన్‌ను అమికస్‌ క్యూరీగాను, ఆమెకు సాయం అందించేందుకు న్యాయవాది లిజ్‌ మాథ్యూను నియమించింది. ‘ప్రతి కౌమార బాలిక లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి. అలా కాకుండా, కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందాన్ని ఆస్వాదించడం కోసం లొంగిపోతే సమాజం దృష్టిలో ఆమె ఓడిపో యినట్లే’అని కలకత్తా హైకోర్టు అక్టోబర్‌ 18వ తేదీన ఓ కేసు తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరిపింది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)