Breaking News

ఆ మహిళల కోసం అలర్ట్‌ వ్యవస్థ: సుప్రీం

Published on Sat, 09/14/2024 - 05:16

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆచూకీ లేకుండా పోయిన మహిళల కోసం కేంద్రీకృత విధానంలో పని చేసే అలర్ట్‌ వ్యవస్థను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మైనర్‌ బాలికల అపహరణ ఉదంతంలో గతంలోనే సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను సూచించడం తెలిసిందే. వాటిలో పలు లోపాలున్నాయని పిటిషనర్‌ తరఫున న్యాయవాది నిత్యా రామకృష్ణన్‌ కోర్టుకు నివేదించారు. 

‘‘బాలిక/మహిళ కనిపించకుండా పోవడంపై ఫిర్యాదులో ఆలస్యం వల్ల న్యాయం దక్కడమూ ఆలస్యమవుతోంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌ అనే కుగ్రామంలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్వనం. నర్సుగా చేస్తున్న ఓ 11 ఏళ్ల పాప తల్లి ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. పాప ఉదయం పక్కింటివాళ్లకు చెప్పింది. వాళ్లు పొరుగింటి వాళ్లకు చెప్పారు. కానీ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు.

 ఎనిమిది రోజుల తర్వాత ఇంటి సమీపంలోనే మృతదేహం దొరికింది. విషయం అందరికీ తెల్సి ఆందోళనలు మొదలయ్యాక గానీ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు కాలేదు. దేశవ్యాప్తంగా నెలకొన్న దుస్థితి కూడా ఇదే’’ అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ధర్మాసనం స్పందించింది. ఈ అంశంలో నోటీసులు ఇచ్చేందుకు అంగీకరించింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)