Breaking News

ఏపీ, రాజస్థాన్‌ రోడ్డు ప్రమాదాలపై ‘సుప్రీం’ విచారణ

Published on Mon, 11/10/2025 - 12:45

ఢిల్లీ: జాతీయ రహదారులలో రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని దాబాలు, రోడ్డు నిర్వహణ సరిగ్గా లేకపోవడం  కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలోని జాతీయ రహదారులపై ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. ఈ రెండు రాష్ట్రాల హైవేల ప్రమాద ఘటనలపై నివేదిక సమర్పించాలని  ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర రవాణా శాఖకు  ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో  సర్వే చేయాలని, రోడ్డు కండీషన్స్ పైన నివేదిక ఇవ్వాలని కోరింది.

మెయింటెనెన్స్ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడించాలని ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయీ ధర్మాసనం ఆదేశించింది. జాతీయ రహదారుల పక్కన దాబాల ఏర్పాటు ప్రమాదాలకు కారణం అవుతున్నదని, ట్రక్కులను రోడ్డుపై ఆపేసి, దాబాలకు వెళ్తున్నారని తెలిపింది. ఆగిన వాహనాలను ఢీకొన్న కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. దీనిని నిరోధించడం అవసరమని సూచించింది. టోల్ చార్జీలు వసూలు చేస్తున్నా రోడ్లు సరిగా ఉండడం లేదని పేర్కొంది. కాగా రాజస్థాన్‌లోని ఫాలోడీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో 18 మంది, శ్రీకాకుళంలో ఈమధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)