Breaking News

లైంగిక వేధింపుల కేసు.. రాజీ కుదుర్చుకున్నా రద్దు చేయలేం: సుప్రీం

Published on Thu, 11/07/2024 - 13:41

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు గురువారం కీల కీలకతీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో ఫిర్యాదుదారుల కుటుంబంతో నిందితుడు రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది. ఈ కేసులోనిందితుడికి ఉపశమనం కలిగిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం కొట్టివేసింది. 

2022లో జస్థాన్‌లోని గంగాపూర్ నగరంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్‌ బాలిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) కేసులు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడు విమల్ కుమార్ గుప్తా స్టాంప్ పేపర్‌పై బాలిక కుటుంబం నుంచి ఓ వాంగ్మూలాన్ని తెచ్చాడు.

అందులో తాము నిందితుడిని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇకపై ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని బాధిత కుటుంబం పేర్కొన్నట్టుగా ఉంది. పోలీసులు దీనిని అంగీకరించి కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే కింది కోర్టు ఈ చర్యను తోసిపుచ్చింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధిత కుటుంబం వాంగ్మూలాన్ని అంగీకరించిన హైకోర్టు.. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని పోలీసులను ఆదేశించింది.

అయితే హైకోర్టు తీర్పును రామ్‌జీ లాల్ బైర్వా అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో సవాలు చేశారు.  ఈ కేసు పూర్వాపరాలు గమనించిన జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది. రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును రద్దు చేయలేమని స్పష్టం చేసింది.అలాగే ఈ కేసును తిరిగి విచారించాలని ఆదేశించింది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)