Breaking News

Supreme Court: మృత్యుకుహరాలా..

Published on Tue, 08/06/2024 - 06:23

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కోచింగ్‌ కేంద్రాలు డెత్‌ ఛాంబర్‌లుగా తయారయ్యాయని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కోచింగ్‌ కేంద్రాలు అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని వ్యాఖ్యానించింది. రావూస్‌ స్టడీ సర్కిల్‌ బేస్‌మెంట్‌లో వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఉదంతంపై సూమోటోగా కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ సోమవారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను జారీచేసింది. ‘‘ మేం చదివే అంశాలు భయంకరంగా ఉన్నాయి. వాస్తవానికైతే ఇలాంటి కోచింగ్‌ కేంద్రాలను మనం వెంటనే మూసేయించాలి. కానీ ప్రస్తుతానికి కోచింగ్‌ ఆపకూడదనే ఉద్దేశంతో వీటిని కేవలం ఆన్‌లైన్‌లో అయినా కొనసాగించాలి. 

భవన నిర్మాణ మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి కోచింగ్‌ సెంటర్లు డెత్‌ చాంబర్లుగా మారాయి. పోటీపరీక్షల ఆశావహుల ఆశలు, జీవితాలతో కోచింగ్‌కేంద్రాలు ఆటలాడుతున్నాయి. ఎన్నో కలలతో దేశరాజధానికొచ్చిన వారికి తమ కలల సాకారం ఎంతో కష్టమవుతోంది. ముగ్గురు అభ్యర్థుల మరణం నిజంగా మనందరికీ కనువిప్పు కల్గించే ఘటన. అసలు కోచింగ్‌ సెంటర్లలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు? వాటిని ఏ మేరకు అమలుచేస్తున్నారో మాకు వివరణ ఇవ్వండి’’ అంటూ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)