Breaking News

కేంద్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు

Published on Tue, 07/25/2023 - 17:48

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. నాగాలాండ్‌లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. కేంద్రానికి చీవాట్లు పెట్టింది.

కాగా నాగాలాండ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే వీటిని పాటించడం లేదంటూ దాఖలైన ధిక్కార పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు  తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. 

సొంత పార్టీ అధికారంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. అదే రాష్ట్రంలో మీ(బీజేపీ) ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ చర్యలు ఉండవని సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

రిజర్వేషన్ అనేది నిశ్చయాత్మక చర్య అని, దీని ఆధారంగా మహిళా రిజర్వేషన్ ఉంటుందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ నిబంధనను ఉల్లఘించి ఎలా వ్యవహరిస్తారనేది అర్థం కావడం లేదని జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ అన్నారు. నాగాలాండ్ మహిళల విద్య, ఆర్థిక, సామాజిక స్థితిగతులు అత్యుత్తమంగా ఉన్న రాష్ట్రం అని.. మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేకపోతున్నారనేది అర్థం కావడం లేదని అన్నారు.  విచారణ సందర్భంగా బీజేపీ పాలిత మణిపూర్‌లో జరిగిన హింసాకాండను కూడా ఆయన ప్రస్తావించారు.
చదవండి: మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)