Breaking News

అడ్డుకుంటే ఊరుకునేది లేదు.. జంతు ప్రేమికులకు సుప్రీం కోర్టు తీవ్ర హెచ్చరికలు

Published on Mon, 08/11/2025 - 13:19

దేశంలో కుక్క కాటు ఘటనలు, రేబిస్‌ మరణాలు పెరిగిపోతున్న వేళ.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనావాస ప్రాంతాల్లో వీధి కుక్కలు సంచరించడం ఎంతమాత్రం సురక్షితం కాదని అభిప్రాయపడింది. దేశ రాజధాని రీజియన్‌ నుంచి వీధి శునకాలను షెల్టర్‌లకు తరలించాలని  ఆదేశిస్తూ..  ఈ క్రమంలో జంతు ప్రేమిక సంఘాలను తీవ్రంగా హెచ్చరించింది కూడా. 

రాజధాని రీజియన్‌లో పసికందులు, వృద్దులుపై వీధి కుక్కల దాడుల ఘటనలపై పలు మీడియా సంస్థలు ఇచ్చాయి. అందులో ఘటనలతో పాటు రేబిస్‌ బారిన పడి మరణించిన దాఖలాలను ప్రస్తావించాయి. ఈ కథనాల ఆధారంగా.. జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం  విచారణ జరిపింది. వీధి కుక్కలను నివాస ప్రాంతాల్లో సంచరించడం ఏమాత్రం యోగ్యం కాదని, వాటిని పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, ఇందుకు 8 వారాల గడువు విధిస్తూ అధికార యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. 

ఏదైనా సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో కేవలం కేంద్రం తరఫున వాదనలు మాత్రమే తాము వినదల్చుకుంటున్నామని, శునక ప్రియులు.. జంతు ప్రేమిక సంఘాల నుంచి పిటిషన్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది. 

వీధికుక్కలను వీలైనంత త్వరగా పట్టుకుని సుదూర ప్రాంతాల్లో వదిలేయండి అని ఈ కేసులో అమీకస్‌ క్యూరీ అయిన గౌరవ్‌ అగర్వాలకు కోర్టు సూచించింది.  ఈ క్రమంలో చర్యలను జంతు సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

కుక్క కాటుకు గురైన వాళ్ల కోసం, రేబిస్‌ బారిన మరణిస్తున్నవాళ్ల కోసం ఈ జంతు సంఘాలు ఏమైనా చేస్తున్నాయా? చనిపోయిన వాళ్లను బతికించి తెస్తున్నాయా?. ఇదేం మా కోసం చేస్తున్నది కాదు. ప్రజల కోసం చేస్తున్నది. కాబట్టి ఇందులో ఎలాంటి సెంటిమెంట్‌కు చోటు ఉండబోదు. ఈ ఆదేశాలను ప్రతిఘటించాలని చూస్తే సత్వర చర్యలు ఉంటాయి జాగ్రత్త’’ అని జస్టిస్‌ పార్దీవాలా వ్యాఖ్యానించారు. అదే సమయంలో వాటిని దత్తత తీసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమని తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎన్సీఆర్‌ రీజియన్‌లోని ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌, గురుగ్రామ్‌ పరిధిలోని అధికార యంత్రాగాలకు దూరంగా డాగ్‌ షెల్టర్‌లను నిర్మించాలని, వీధి కుక్కలను వెంటనే అక్కడికి తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఢిల్లీ వీధి కుక్కల వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)