Breaking News

ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలతో వెళ్తున్నా..

Published on Wed, 05/14/2025 - 01:33

న్యూఢిల్లీ:  న్యాయ వ్యవస్థలో సుదీర్ఘకాలం పనిచేసి ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు సొంతం చేసుకున్నానని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంతోషం వ్యక్తంచేశారు. జీవితాంతం ఈ జ్ఞాపకాలు తనకు తోడుగా ఉంటాయని చెప్పారు. తన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పదవీ కాలం ముగియడంతో మంగళవారం ఆయనకు లాంఛనంగా వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టులో నిర్వహించిన సెర్మోనియల్‌ బెంచ్‌లో జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబల్‌ తదితరులు పాల్గొన్నారు. 

న్యాయ వ్యవస్థకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అందించిన సేవలను వక్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రసంగించారు. నూతన సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ పట్ల తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు విలువలు, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను ఆయన చక్కగా పరిరక్షిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. తనకు ఇన్నాళ్లూ అతిపెద్ద మద్దతుదారుడిగా నిలిచారని కొనియాడారు. జస్టిస్‌ గవాయ్‌ నాయకత్వాన్ని ఎంతగానో విశ్వసిస్తున్నానని, రాజ్యాంగ విలువల పట్ల ఆయన అంకితభావం తిరుగులేనిదని వెల్లడించారు. తాము దాదాపు ఒకేసారి న్యాయమూర్తులుగా పదోన్నతి పొందామని, కొలీజియంలో కలిసి పనిచేశామని చెప్పారు. తదుపరి సీజేఐగా జస్టిస్‌ గవాయ్‌ అద్భుతమైన సేవలు అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.  

ఖన్నాతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం  
సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అందించిన సేవలను జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ కొనియాడారు. ఇది వీడ్కోలు కాదని, ఒక మార్పు మాత్రమేనని చెప్పారు. జస్టిస్‌ ఖన్నా వృత్తి జీవితం ఈరోజుతో ఆగిపోవడం లేదని, మరొకదానికి ఇది ఆరంభమని వివరించారు. జస్టిస్‌ ఖన్నా ఆలోచల్లో స్పష్టత, నైతికత, ప్రాథమిక హక్కుల పరిరక్షణ పట్ల అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఆయన ఇచి్చన తీర్పులన్నీ రాజ్యాంగ విలువలతో కూడి ఉన్నాయని చెప్పారు. జస్టిస్‌ ఖన్నాతో ఇన్నాళ్లూ కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. జస్టిస్‌ ఖన్నా తమకు స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నారు.

అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి మాట్లాడుతూ... జస్టిస్‌ ఖన్నా న్యాయస్థానాల విలువ, గౌరవం ఎన్నోరెట్లు పెంచారని ప్రశంసించారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సైతం జస్టిస్‌ ఖన్నా సేవలను గుర్తుచేసుకున్నారు. కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ... ఈ వారం దేశంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు పదవీ విరమణ చేశారని చెప్పారు. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతోపాటు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా రిటైర్‌ అవుతున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు మంగళవారం వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కపిల్‌ సిబల్‌ ప్రసంగించారు. రెండు దశాబ్దాలపాటు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ ఖన్నా న్యాయం పట్ల తిరుగులేని అంకితభావం కనబర్చారని చెప్పారు.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)