Breaking News

ఓటర్లు వీవీప్యాట్‌ స్లిప్‌లు పొందవచ్చా?: ఈసీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Published on Thu, 04/18/2024 - 15:27

న్యూఢిల్లీ: లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తన్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో పవిత్రత ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. దేశంలో ఎన్నికలు సజావుగా, నిస్పక్షపాతంగా జరిగేలా అనుసరించే చర్యలను వివరించాలని ఈసీ కోరింది. ‘ఇది ఎన్నికల ప్రక్రియ. పవిత్రంగా ఉండాలి. ఓటర్లు ఆశించినది జరగడం లేదని ఎవరూ భయాందోళన చెందకుండా చూసుకోవాలి’ అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం పేర్కొంది. 

ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ (ఈవీఎం) ఓట్లతో వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా రూపొందించిన పేపర్ స్లిప్‌లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారణ జరిపింది.  ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది మణిందర్‌సింగ్‌, పిటిషనర్లలో ఒకరి తరపున అడ్వకేట్‌ నిజాంపాషా మాట్లాడుతూ.. ఓటరు ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌ స్లిప్‌ తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. అయితే అలాంటి ప్రక్రియ ఓటరు గోప్యతను ప్రభావితం చేయదా అని జస్టిస్‌ ఖన్నా ప్రశ్నించారు.  ఇది ఓటర్‌ గోప్యతను, ఓటరు హక్కులను భంగం కలిగించదని  పాషా బదులిచ్చారు.

అనంతరం మరో పిటిషనర్‌ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. VVPAT మెషీన్‌లోని లైట్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలని కోరారు. ప్రస్తుతం ఈ లైట్‌  అది ఏడు సెకన్ల పాటు ఆన్‌లో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ఒకవేళ పేపర్‌ స్లిప్‌ అందించడం వీలు కాకపోతే కనీసం ఎల్లవేళలా లైట్ వెలుగుతూనే ఉండేలా చూడాలని కోరారు. దీనివల్ల ఓటర్‌ స్లిప్ కటింగ్, బాక్స్‌లో పడిపోవడం చూడగలుగుతాడని చెప్పారు. ఇది వారి గోప్యతకు అడ్డు రాదని చెప్పారు.

ఈ సందర్భంగా ఇటీవల కేరళలో జరిగిన మాక్‌ పోల్‌ గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాసర్‌గోడ్‌లో జరిగిన మాక్‌ ఓటింగ్‌లో బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని కోర్టుకు తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అనంతరం ఆ నివేదిక పూర్తి అవాస్తవమని ఈసీ వెల్లడించింది. పారదర్శక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని ఈసీని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల సంఘం తమ ప్రక్రియను న్యాయస్థానానికి వివరించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. 
చదవండి: రాహుల్ గాంధీకి ధైర్యం లేదు: రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)