Breaking News

జైల్లోంచి పనిచేయకుండా కేజ్రీవాల్‌పై నిషేధం ఉందా?

Published on Sat, 09/07/2024 - 06:13

సాక్షి, న్యూఢిల్లీ: జైలులో నుంచి విధులు నిర్వర్తించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై నిషేధమేమైనా ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయడంలో జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు అవరోధాలేమిటని నిలదీసింది. ముందస్తు విడుదలకు సంబంధించి ఫైళ్లపై నిర్ణయాలు ఆలస్యం కావడం సరికాదని అభిప్రాయపడింది.

 ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన కేసును శుక్రవారం జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సాధారణంగా ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను చేరాలంటే తొలుత ముఖ్యమంత్రి సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో జైలులో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ సదరు ఫైలుపై సంతకం చేయడం ఆలస్యం కావడాన్ని కోర్టు గుర్తించింది.

 ఈ నేపథ్యంలో ‘‘జైలు నుంచి సీఎం కేజ్రీవాల్‌ ముందస్తు విడుదల ఫైళ్లపై సంతకం చేయకూడదని ఏమైనా నిబంధన ఉందా? స్వయంగా ఓ కేసులో విచారణ ఖైదీగా ఉన్న సీఎం సదరు ఫైలుపై సంతకం చేయకుండా నిషేధం ఏమైనా ఉందా?’’అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. 

దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుంటామని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యభాటి, సీనియర్‌ న్యాయవాది అర్చనా దవేలు కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి ఘటన ఎదురు కాలేదని వివరించారు. ఒకవేళ అలాంటి నిబంధన ఏమైనా ఉంటే చెప్పాలని లేదంటే ఆరి్టకల్‌ 142 ఇచి్చన అధికారాలతో కోర్టు పరిశీలన చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసులు ఎక్కువ కాలం వేచి ఉండరాదని అభిప్రాయపడుతూ ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు