సైకత శిల్పంలో వందేళ్ల ఆర్‌ఎస్‌ఎస్‌.. వ్యవస్థాపకులకు పట్నాయక్‌ నివాళులు

Published on Thu, 10/02/2025 - 12:15

భువనేశ్వర్‌: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) నేడు (విజయ దశమి) వందవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది.  ఆర్‌ఎస్‌ఎస్‌ 1925లో ప్రారంభమయ్యింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని గుర్తుచేస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీత, అంతర్జాతీయంగా పలువురు ప్రశంసలు పొందిన సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో ‘100 ఏళ్ల నిస్వార్థ సేవ’ అనే సందేశంతో అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు.

ఎనిమిది టన్నుల ఇసుకతో రూపొందించిన ఈ ఆరు అడుగుల పొడవైన కళాకృతిలో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ (గురూజీ)లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘వందేళ్ల ఆర్‌ఎస్‌ఎస్‌  అందించిన క్రమశిక్షణ, నిస్వార్థ సేవా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. 65కి పైగా అంతర్జాతీయ శాండ్ ఆర్ట్ ఈవెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన పట్నాయక్.. వాతావరణ మార్పు, ప్రజారోగ్యం తదితర సామాజిక సమస్యలపై అవగాహన పెంచేందుకు సైకత కళను ‍ప్రదర్శిస్తుంటారు.
 

1925లో నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. పౌరులలో సాంస్కృతిక అవగాహన, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి  ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంస్థగా ఇది ప్రారంభమైంది. గత వందేళ్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన సామాజిక-సాంస్కృతిక సంస్థలలో ఒకటిగా నిలిచింది. వరదలు, భూకంపాలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో  సాయం అందించడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)