Breaking News

బిడ్డను కడతేర్చిన తల్లి... వెలుగులోకి మరిన్ని వివరాలు!

Published on Wed, 01/10/2024 - 16:30

బళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన ఏఐ స్టార్టప్‌ కంపెనీ సీఈఓ సుచనా సేథ్‌ కేసులో కీలక విషయాలు బయటపడుత్నాయి. పోలీసులకు హత్య‌ జరిగిన గోవాలోని సర్వీస్‌ అపార్టుమెంట్‌ గదిలో ఖాళీగా ఉన్న రెండు సిరప్‌ సీసాలు లభ్యమయ్యాయి. సిరప్‌ను అధిక డోస్‌తో తన కుమారుడికి తాగించి హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా పరిశీలిస్తే సుచనా సేథ్‌ ముందుగానే తన కుమారుడిని హత్య చేయాలని ప్రణాళిక వేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికల్లో మాత్రం బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మరణించడానికి ఒక వస్త్రం లేదా తలగడను ఆమె ఉపయోగించినట్లు తెలుస్తోందని వెల్లడించారు.

సుచనా సేథ్‌ గోవాలో ఉన్న సర్వీస్‌ అపార్టుమెంట్‌లో రెండు సిరప్‌ బాటిల్స్‌ (ఒకటి చిన్నది, మరోటి పెద్దది) లభించినట్లు సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో బాలుడు ఎటువంటి పెనుగులాట లేకుండా మృతి చెందినట్లు తెలుస్తోందని చెప్పారు. అయితే బాలుడు మరణించక ముందు సుచనా అతనికి అధిక డోస్‌తో కూడిన సిరప్‌ను తాగించిందా? అన్న విషయంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సుచనాకు దగ్గు వస్తోందని సిరప్‌ కొనుగోలు చేయాలని సర్వీస్‌ అపార్టుమెంట్‌ సిబ్బందితో చెప్పిందని పోలీసు అధికారి తెలిపారు. దానితోపాటు ఆమె మరో పెద్ద సిరప్‌ బాటిల్‌ను కూడా కొనుగోలు చేసి తన వెంట తెచ్చుకుందని పేర్కొన్నారు.

ఈ వ్యవహారాన్ని పరిళీలిస్తే పక్కా​ ప్రణాళిక ప్రకారం బాలుడిని ఆమె హత్య చేసిందని అ‍న్నారు. ప్రాథమిక విచారణలో మాత్రం బాలుడిని తాను హత్య చేయలేదని, తాను నిద్ర లేచేవరకు బాలుడు మృతి చెంది ఉన్నాడని సుచనా సేథ్‌ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె చెప్పే విషయాలపై పలు అనుమానాలు కలుగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు. త్వరలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని.. బాలుడిని హత్య చేయడానికి ఆమెకు గల ప్రధానమైన కారణాన్ని చేధిస్తామని సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు.  ప్రస్తుతం ఆమె తన భర్తతో విడాకులు తీసుకొవాలని వేరుగా ఉంటోందని.. అదే విషయంలో బాలుడిని హత్య చేసినట్లు తెలుస్తోందని తెలిపారు.     

ఏఐ స్టార్టప్‌ కంపెనీ సీఈఓ సుచనా సేథ్‌ గోవాలో తన కుమారుడిని చంపి, కొడుకు శవాన్ని బ్యాగులో కుక్కి ట్యాక్సీలో కర్ణాటకకు తరలించారు. సోమవారం రాత్రి చిత్రదుర్గలో అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. నిందితురాలు సుచనా సేథ్‌ను విచారణ నిమిత్తం ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ గోవా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

చదవండి: మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)