Breaking News

అండగా ఉన్నోళ్లనే అక్కున చేర్చుకోండి

Published on Thu, 02/20/2025 - 05:46

సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ భావజాలానికి కట్టుబడి, ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీకోసం నిలబడిన వ్యక్తులను ప్రోత్సహించాలని, కష్ట సమయాల్లో పార్టీని వీడిన నేతలను దూరం పెట్టాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ‘పార్టీకి సైద్ధాంతికంగా కట్టుబడి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించండి. కష్ట సమయాల్లో పారిపోయే బలహీనులకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా కష్టకాలంలో పార్టీని వీడిన నేతలను తొందరపడి చేర్చుకుంటారు. 

మనం అలాంటి వ్యక్తులను దూరం పెడదాం’ అని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ నూతన ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జీలతో ఖర్గే సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హాజరయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టత, భవిష్యత్‌ ప్రణాళికలపై ఆ సమావేశంలో చర్చించారు.

 ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ‘పార్టీని బూత్‌ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతంం చేసే బాధ్యతను ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జీలు తీసుకోవాలి. ఈ పని కోసం మీరే బూత్‌కు వెళ్లాలి. కష్టపడి పనిచేయాలి. కార్మికులతో సంభాషించాలి. పార్టీ విభాగాలతో చర్చించాలి. సంస్థ పునర్‌ నిర్మాణంలో ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌టీయూసీ) ని భాగస్వామ్యులను చేయండి’’ అని ఖర్గే సూచించారు. ‘‘రాష్ట్రాల్లో పార్టీ నిర్వహణ, భవిష్యత్తు ఎన్నికల ఫలితాలకు ఆయా రాష్ట్రాల ఇన్‌ఛార్జీలే బాధ్యత వహించాలి. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల సమయంలో మన పార్టీ మద్దతుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడమో లేక ఆ పేరును మరో బూత్‌లోకి మార్చడమో చేస్తున్నారు. ఈ రిగ్గింగ్‌ను ఎలాగైనా మనం ఆపాలి’’ అని ఖర్గే పిలుపునిచ్చారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)