Breaking News

20 ఏళ్లకే గ్రేడ్‌ వన్‌ అధికారిగా.. ఉత్కర్ష్ శుక్లా సక్సెస్‌ స్టోరీ

Published on Sun, 12/29/2024 - 12:11

జీవితంపై కోటి ఆశలతో కలలుగనేవారు వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. అలాంటివారే విజయాలను అందుకుంటారు. దీనిని పలువురు రుజువు చేశారు. ఆ కోవలోకే వస్తాడు యూపీలోని అమేథీకి చెందిన ఉత్కర్ష్ శుక్లా. ఒకనాడు తనకు చదువుకునే పరిస్థితి లేకపోయినా పట్టుదలతో అనుకున్నది సాధించి చూపాడు.

యూపీలోని అమేథీలో గల రాజీవ్ గాంధీ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌లో ఉత్కర్ష్ శుక్లా బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు ఉత్కర్ష్ శుక్లా డిగ్రీతోపాటు  రాష్ట్రపతి బంగారు పతకం కూడా అందుకున్నాడు. చిన్నప్పటి నుండి ఉత్కర్ష్‌కు చదువులో ఘన విజయం సాధించాలనే తపనతో ఉండేవాడు. ఉత్కర్ష్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి.

బీటెక్‌ పూర్తి చేసిన ఉత్కర్ష్‌ ప్రస్తుతం భారత్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్‌లో గ్రేడ్ వన్ అధికారిగా ఎంపికయ్యారు. 20 ఏళ్ల వయసులో ఉత్కర్ష్ ఇంతటి గొప్ప విజయాన్ని సాధించాడు. ఉత్కర్ష్‌ మీడియాతో మాట్లాడుతూ తాను సాధించిన విజయం తనకు ఎంతో ఆనందమిస్తున్నదని చెబుతూ, తాను గతంలో ఎదుర్కొన్న​ అనుభవాలను తెలిపాడు. కరోనా సమయంలో పుస్తకాలు దొరక్క చదువుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని, పోటీ పరీక్షల ప్రపరేషన్‌కు అనేక ఆటంకాలు ఎదురయ్యాయని తెలిపాడు. అయితే పట్టువదలక పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించానని అన్నాడు. 

ఇది కూడా చదవండి: ఎంఏ చాయ్‌వాలా.. ఏటా లక్షల సంపాదన

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)