Breaking News

నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్‌ జీవితం మారిందిలా..

Published on Sat, 02/01/2025 - 12:02

ఉద్యోగం కన్నా ఉపాధి మార్గం ఉత్తమం అని కొందరు అంటుంటారు. ఈ దిశగా పయనిస్తూ చాలామంది విజయం సాధించారు. ఇదే తరహాలో ముందడుగు వేసిన ఒక యువకుడు అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు. అందరికి స్ఫూర్తిని అందిస్తున్నాడు. మరి ఆ యువకుడు ఎవరో ఏం సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం. 

దేశంలో ఇటీవలి కాలంలో పర్యాటకరంగ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో చాలామందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ జాబితాలో గుజరాత్‌ మొదటి స్థానంలో నిలిచిందని చెబుతుంటారు. పర్యాటకరంగం అభివృద్ధి కారణంగా  గుజరాత్‌లోని యువత నూతన స్టార్టప్‌(New startup)లతో జీవనోపాధి పొందుతున్నారు. అలాంటివాటిలో ఒకటే టాక్సీ సర్వీస్‌ నిర్వహణ.

కుటుంబంతో  సహా ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారు టాక్సీ ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తుంటారు. టాక్సీ బుక్ చేసుకుని పర్యాటక ప్రదేశాల్లో విహరిస్తుంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక గ్యారేజీలో పనిచేసే సందీప్ ప్రజాపతి ట్యాక్సీ సర్వీస్‌ ప్రారంభించాడు. అతనుంటున్న ప్రాంతానికి సమీపంలోని ద్వారకతో పాటు శివరాజ్‌పూర్ బీచ్, సుదర్శన్ సేతు, హర్షద్ అండ్‌ భన్వాడ్ తదితర పర్యాటక ప్రదేశాలకు(tourist places) ట్యాక్సీని నడపడం ప్రారంభించాడు. దీనికి అనతి కాలంలోనే పరిమితమైన ఆదరణ దక్కింది.

సందీప్ ప్రజాపతి గుజరాత్‌(Gujarat)లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాల గురించి అధ్యయనం చేశాడు. ‘ఖుషి క్యాబ్’ పేరుతో టాక్సీ సర్వీస్‌ మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా అతని వ్యాపారం(Business) అభివృద్ధి చెందింది. ప్రస్తుతం నాలుగు ట్యాక్సీలు, ఎనిమిది మంది డ్రైవర్లతో సందీప్‌ ప్రజాపతి వ్యాపారం అందరూ మెచ్చుకునేలా నడుస్తోంది. తన కార్లకోసం గ్యారేజీని ఏర్పాటు చేసిన సందీప్‌ ఇద్దరు వర్కర్లను కూడా నియమించుకున్నాడు. కిలోమీటరుకు రూ. 10 నుండి రూ. 15 వరకూ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నాడు. గతంలో మెకానిక్‌గా పనిచేస్తూ నెలకు రూ. 10 వేలు సంపాదించే సందీప్‌ నేడు లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్నాడు.

ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు