Breaking News

వాటర్ కానన్‌ ప్రయోగించిన పోలీసులు.. తడుస్తూ విద్యార్థుల డ్యాన్స్

Published on Thu, 07/23/2026 - 17:54

న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై బిహార్‌ రాజధాని పట్నాలో నిరసన తెలిపిన విద్యార్థులు ఉద్రిక్త పరిస్థితిని వైరల్‌ సీన్‌గా మార్చారు. తీవ్ర ఎండ ఉందంటూ వాటర్ కానన్ వాడాలని పోలీసులను వారు కోరగా.. నీళ్లు చల్లిన వెంటనే విద్యార్థులు నీళ్లలో తడుస్తూ డ్యాన్స్ చేశారు.

భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులను గాంధీ మైదాన్ సమీపంలో, గవర్నర్ నివాసానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో పోలీసులు బ్యారికేడ్లతో అడ్డుకున్నారు.

వైరల్ అయిన నిరసన దృశ్యాలు
వైరల్ వీడియోలో విద్యార్థులు పోలీసులతో, "సార్.. వాటర్ కానన్ లేదా? చాలా వేడిగా ఉంది" అని చెప్పడం వినిపించింది. పోలీసులు నీళ్లను విద్యార్థులపై ప్రయోగించారు. వెంటనే అక్కడి నుంచి తప్పుకోకుండా విద్యార్థులు అదే చోట డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

 

మరో వైరల్ వీడియోలో విద్యార్థులు పోలీసుల తాడుతో తాడు థగ్‌ ఆఫ్‌ వార్‌ ఆడినట్టు కనిపించారు. ఇంకో వీడియోలో పోలీసులు నిరసనకారులను అడ్డుకునేందుకు పెట్టిన బ్యారికేడ్లను కొందరు ఎత్తుకుని పరుగెత్తారు. మరో ఘటనలో గేటు బోల్టులు తీసేసి దాన్నే తీసుకెళ్లినట్టు వార్తలు వచ్చాయి.

ఈ వీడియోలపై సామాజిక మాధ్యమాల్లో జోకులు, మీమ్స్ వెల్లువెత్తాయి. "ఇది జంతర్ మంతర్ కాదు బాబూ... ఇది బిహార్" అనే అని కామెంట్లు చేశారు. కొందరు ఈ దృశ్యాలను హోలీ పండుగతో పోల్చారు. నిరసనకు అంతరాయం కలిగించేందుకు ఓ బీజేపీ నాయకుడు అక్కడికి వచ్చారు. ఆయన చేతిలో ఉన్న జెండాను చూసి గుర్తించిన విద్యార్థులు దాడి చేశారు. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని ఆ బీజేపీ నాయకుడిని రక్షించారు.

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)