amp pages | Sakshi

ఓట్ల కోసం స్టూడెంట్స్‌ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

Published on Fri, 08/26/2022 - 21:06

జైపూర్‌: వివిధ సంస్థల్లో యూనియన్‌లు ఏర్పాటు చేసి దానికి లీడర్లను ఎన్నుకోవడం సాధారణ విషయమే, విద్యాసంస్థల్లోనూ ఈ విధానం అమలవుతోంది. కాలేజీ, యూనివర్సిటీలోనూ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఎలక్షన్స్‌ ఉంటాయి. అక్కడ కూడా స్టూడెంట్స్‌ తమలో ఒకరిని విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేసే విద్యార్థి నాయకులంతా ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల హామీలు, వాగ్దానాలు చేస్తుంటారు. ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు తనను ఎన్నుకుంటే చేసే అభివృద్ధిని వివరిస్తూ వరాల జల్లు కురిపిస్తారు. 

అచ్చం ఇలాగే ఓ కాలేజీలో లీడర్‌గా పోటీ చేస్తున్న కొందరు విద్యార్థి నాయకులు ఓట్ల కోసం వినూత్నంగా వేడుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బరన్‌ జిల్లాలోని ఓ కళాళాలలో విద్యార్థి సంఘాల నేతలు ఓటు వేయడానికి వస్తున్న ప్రతి స్టూడెంట్స్‌ను అడ్డుకొని నమస్కరించి, కాళ్లు పట్టుకొని, తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యంగా అమ్మాయిలు కనిపిస్తే వారి కాళ్లపై పడి పాదాలు పట్టుకొని తనకు అనుకూలంగా ఓట్లు వేయాలని ప్రాధేయపడ్డారు.
చదవండి: అదరగొట్టిన ఆఫ్రికన్‌ చిన్నారులు.. కేటీఆర్‌ మెచ్చిన డ్యాన్స్‌ వీడియో

ఓటు వేస్తామని విద్యార్థులు భరోసా ఇచ్చేంత వరకు తమ కాళ్లను వదిలిపెట్టకుండా పట్టేసుకున్నారు. దీంతో కాళ్లు పట్టుకొని ఓట్లు అడుగుతున్న వారిని చూసి అక్కడున్న వారంతా ఆశ్యర్యపోయారు. ఈ వీడియోను అన్‌సీన్ ఇండియా అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా రెండేళ్ల విరామం తర్వాత శుక్రవారం రాజస్థాన్‌లో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. శనివారం ఉదయం ఓట్ల లెక్కించి, మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెల్లడించనున్నారు.
చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్‌ స్పిన్నింగ్‌.. తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకొని

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)