Breaking News

సెల్ఫీ తీస్తుండగా ఉగ్ర అల.. విద్యార్థిని మృతి, యువకుడు గల్లంతు

Published on Sun, 07/26/2026 - 09:13

సాక్షి, చెన్నై : రీల్స్, సెల్పీల వ్యామోహంతో సముద్రంలో దిగి మరీ వీడియో చిత్రీకరించుకుంటూ వచ్చిన విద్యార్థుల బృందాన్ని భారీ అల తాకింది. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులను జాలర్లు రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు. మరొకరు మరణించారు. శనివారం  చెన్నై ఎన్నూర్‌ బీచ్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చెన్నై సూరపట్టులోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్న కృతిక (19), ఆకాష్‌ (21), పవిత్ర, తరుణ్, శివాని అనే ఐదుగురు విద్యార్థుల బృందం ఎన్నూర్‌ రామకృష్ణా నగర్‌ సముద్ర తీరానికి విహారయాత్రకు వచ్చారు. సముద్రం మధ్యలో ఉండే రాళ్లపై నిలబడి సెల్ఫీ, వీడియోలు  తీసుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా వచ్చిన ఉగ్ర అలల తాకిడికి వారంతా సముద్రంలో పడిపోయారు. 

స్థానిక మత్స్యకారుల సహాయంతో అక్కడున్నవారు ఇద్దరు విద్యార్థులను అతికష్టంపై రక్షించారు. సముద్రంలో మునిగి పోయి కొన ఊపిరితో ఉన్న కృతికను రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలల్లో కొట్టుకుపోయిన మరో విద్యార్థి ఆకాష్‌ కోసం అగి్నమాపక సిబ్బంది, పోలీసులు, మత్స్యకారులు తీరం వెంబడి తీవ్రంగా గాలింపు చేపట్టారు. బతికి ఉండేందుకు ఛాన్స్‌ లేని దృష్ట్యా, చెన్నై తీరంలో మృతదేహం ఏదైనా ఒడ్డుకు కొట్టుకువచ్చిందా? అని ఆరా తీస్తున్నారు. కాగా, మృతి చెందిన కృత్రిక పుదుచ్చేరికి చెందిన విద్యార్థి కాగా, ఆకాశ్‌  చెన్నై తిరునగర్‌ కు చెందిన వైదీశ్వరన్‌ కుమారుడిగా గుర్తించారు.   

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)