Breaking News

అమెరికాకు వెళ్లాలా?

Published on Mon, 09/29/2025 - 04:36

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక.. ‘డాలర్‌ డ్రీమ్స్‌’కి బ్రేకులు పడటం మొదలయ్యాయి. కొత్తగా పెట్టిన హెచ్‌–1బీ వీసా ‘లక్ష డాలర్ల’ నిబంధన.. పెద్ద స్పీడ్‌ బ్రేకర్‌ అంటున్నారు నిపుణులు. ఇప్పటికే అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 2024 మొదటి 8 నెలలతో పోలిస్తే.. 2025లో ఆగస్టు వరకు అమెరికా వెళ్లిన వారి సంఖ్య 4.3 శాతం తగ్గింది. ప్రత్యేకించి ఆగస్టులో ఇది ఏకంగా 14.8 శాతం తగ్గింది. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.

అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం (యూఎస్‌ ఐటీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి 8 నెలల్లో... విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన భారతీయులు 1,77,435. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 26.1 శాతం తక్కువ. ఇక పర్యాటక వీసాల మీద వెళ్లినవారు 9.98 లక్షలు. గతేడాది మొదటి 8 నెలలతో పోలిస్తే ఇది 2.7 శాతం తక్కువ.

ఏయే వీసా మీద ఎంతమంది?
ప్రత్యేకించి విద్యార్థి వీసా మీద అమెరికా వెళ్లే వారి సంఖ్య.. 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 44.5 శాతం తగ్గిపోయింది. పర్యాటక, విద్యార్థి వీసాలపై వెళ్లినవాళ్లు తగ్గడంతో మొత్తం సంఖ్యలోనూ భారీ తగ్గుదల నమోదయింది.

 యూకే తరవాత మనమే
యూఎస్‌ ఐటీఏ గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లలో ఆగస్టు నెలలో అమెరికాకు  వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టులో వీరి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2025లో ఆగస్టు వరకు చూస్తే.. యూకే తరవాత అమెరికాను అత్యధికంగా సందర్శించింది భారతీయులే. ఈ ఏడాది మొదటి 8 నెలల్లోమొత్తం 14.87 లక్షల మంది అమెరికాకు వెళ్లారు. 2024 జనవరి – ఆగస్టుతో పోలిస్తే ఇది 4.3 శాతం తక్కువ.

ఈ ఏడాది తగ్గుతుందా?
భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ గణాంకాల ప్రకారం.. అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య 2022 నుంచి భారీగా పెరుగుతోంది. కానీ, ఈ ఏడాది గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై సెప్టెంబరు 30న ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో యూఎస్‌ వెళ్లిన మొత్తం భారతీయులు సుమారు 19.4 లక్షలు. గతేడాది సెప్టెంబర్‌లో 1.81 లక్షల మంది వెళ్లారు. ఈసారి సెప్టెంబరులో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సంఖ్య 21 లక్షలు దాటకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)