Breaking News

నా రీల్స్‌ చూడటం తగ్గించండి సారూ.. ఢిల్లీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Mon, 09/22/2025 - 16:26

ఢిల్లీ: తన రీల్స్‌ చూడటం ఆపండంటూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwalపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా(Rekha Gupta) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈవీఎంల(EVMs)పై రేఖా గుప్తా మాట్లాడుతున్నట్లుగా ఓ ఎడిటెడ్‌ వీడియోను సామాజిక మాధ్యమంలో నిన్న(ఆదివారం) కేజ్రీవాల్‌ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రేఖా గుప్తా.. తన వీడియోలు, రీల్స్‌ చూడటం తగ్గించి.. తన సొంత పార్టీపై దృష్టి పెట్టాలంటూ కేజ్రీవాల్‌కు చురకలు అంటించారు.

ఎలక్ట్రిక్ బస్ డిపోకు శంకుస్థాపన చేసిన రేఖాగుప్తా.. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. "నేను కేజ్రీవాల్‌కు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. దయ చేసి నా వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ చూడటం తగ్గించండి’’ అంటూ హితవు పలికారు. కేజ్రీవాల్‌ పంజాబ్ ప్రజలపై దృష్టి పెట్టాలి. అత్యంత ఘోరమైన వరద విపత్తును ఎదుర్కొన్న ఆ రాష్ట్రంలో బాధితులను ఆయన ఎప్పుడూ పరామర్శించలేదంటూ ఆమె విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి: బీహార్‌లో మూడు దశల్లో ఎన్నికలు.. ఎప్పుడంటే?

‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించినందుకు మీరు సిగ్గుపడాలి. మీరు 11 సంవత్సరాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఢిల్లీ అభివృద్ధిపై దృష్టి సారించి ఉంటే, ప్రజలు బాధలుపడేవారు కాదంటూ కేజ్రీవాల్‌పై రేఖాగుప్తా ధ్వజమెత్తారు. రాహుల్‌ గాంధీపై కూడా ఢిల్లీ సీఎం తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్‌ గెలిస్తే అది ప్రజల తీర్పు, మేము గెలిస్తే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయా? ఈ ఫార్ములా ఎక్కడ రాసుంది? అంటూ ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే’’ అంటూ రేఖా గుప్తా మండిపడ్డారు.

 


 

 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు