Breaking News

వందే భారత్‌పై రాళ్ల దాడి.. ఫుడ్‌ బాగాలేదని ప్రయాణీకులు సీరియస్‌

Published on Sun, 07/02/2023 - 12:39

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా మరో వందే భారత్‌పై రాళ్ల దాడి జరిగింది. ధార్వాడ్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు.. వందే భారత్‌లో ఫుడ్‌ సరిగాలేదని ప్రయాణీకులు ఆందోళనలకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. శనివారం (జూలై 1) ధార్వాడ్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో రైలు కిటికీ అద్దాలకు స్వల్ప నష్టం జరిగింది. దేవంగిరి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల మధ్య దేవంగిరి స్టేషన్ నుంచి రైలు బయలుదేరి కొంతదూరం చేరుకోగానే రాళ్ల దాడి జరిగింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఆర్పీఎఫ్ రైల్వే చట్టంలోని సెక్షన్ 153 (రైల్వే ఆస్తులను స్వచ్ఛందంగా ధ్వంసం చేయడం) కింద కేసు నమోదు చేసింది. దీని కింద ఐదేళ్ల వరకు శిక్ష విధించే నిబంధన ఉంది. కాగా, ఈ రైలును ప్రధాని మోదీ జూన్‌ 28వ తేదీన జెండా ఊపి ప్రారంభించారు. 

ఇదిలా ఉండగా.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించే ఆహారం చెడిపోయిందని ప్రయాణీకులు ఆగ్రహం ‍వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రైలు ప్రయాణిస్తున్న వారు అధికారులను నిలదీశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: డ్రోన్లతో రోడ్డు ప్రమాదాలకు చెక్‌ ?

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)