Breaking News

దీపావళి వేళ.. వందేభారత్‌పై రాళ్ల దాడి!

Published on Mon, 11/09/2026 - 07:18

అమ్రేలీ: గుజరాత్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. దీపావళి నాడు అమ్రేలీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో రైలులోని కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సబర్మతి-వెరావల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఖిజాడియా, చిటల్ రైల్వే స్టేషన్ల మధ్య గ్రామీణ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. రైలులోని ఈ2 కోచ్‌లో 9, 10 సీట్ల సమీపంలో ఉన్న కిటికీకి అమర్చిన లోపలి, బయటి రెండు పొరల అద్దాలు పగిలిపోయాయి.

సాధారణంగా వందేభారత్ రైళ్లలో అత్యంత పటిష్ఠమైన రెండు పొరల భద్రతా అద్దాలను ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ రైలు వేగంగా వెళ్తున్న సమయంలో రాయి తగలడంతో రెండు అద్దాలు ధ్వంసమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన లాఠీ సమీపంలో జరిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఖిజాడియా రైల్వే స్టేషన్‌కు సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు తెలిపారు. పశ్చిమ రైల్వే భావ్‌నగర్ డివిజన్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అజయ్ శర్మ కూడా ఘటనను ధ్రువీకరించారు. రైల్వే బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ దాడి జరిగిన కచ్చితమైన ప్రాంతం, సమయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి.

నాలుగు నెలల్లో మూడో ఘటన
గుజరాత్‌లో వందేభారత్ రైలుపై నాలుగు నెలల వ్యవధిలో రాళ్ల దాడి జరగడం ఇది మూడోసారి. గతంలో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో ముంబై-అహ్మదాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై సూరత్ జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా సబర్మతి-వెరావల్ వందేభారత్ రైలు (26901/26902) అమ్రేలీ మీదుగా ధోలా వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వరుసగా ఇలాంటి దాడులు చోటుచేసుకుంటుండటంతో రైల్వే భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) దర్యాప్తు ప్రారంభించింది. దాడికి పాల్పడినవారు ఎవరు? ఏ కారణంతో రైలుపై రాళ్లు విసిరారు? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి: దీపావళి ఎఫెక్ట్: విషవాయువుల కోరల్లో ఢిల్లీ

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)