Breaking News

కాళీ నిమజ్జనంలో రాళ్లదాడి

Published on Sat, 11/02/2024 - 10:44

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో కాళీమాత విగ్రహం నిమజ్జనంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. రాజాబజార్ పరిధిలోని నార్కెల్‌దంగ ప్రాంతంలో కాళీమాత విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలంలో ఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించారు.

కాళీమాత విగ్రహం నిమజ్జనం ఊరేగింపుపై రాళ్లు రువ్విన ఘటన స్థానికంగా కలకలంరేపింది. అప్రమత్తమైన పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని కోల్‌కతా పోలీసులు సోషల్ మీడియా సైట్‌లో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. పార్కింగ్ విషయంలోవివాదం జరిగిందని, దీనిని బీజేపీ నేతలు రాళ్లదాడి ఘటనగా చెబుతున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

హిందువులు చేపట్టిన ఊరేగింపుపై మమతా బెనర్జీవర్గానికి చెందినవారు రాళ్లు రువ్వారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. మమతా బెనర్జీ వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తక్షణమే పదవి నుండి వైదొలగాలని  ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ రాజాబజార్‌లో కాళి నిమజ్జనం ఊరేగింపుపై దాడి జరిగిందని, పోలీసులు భక్తులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)