Breaking News

ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు.. ఢిల్లీలో కలకలం

Published on Sat, 09/28/2024 - 09:13

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలన  ఉదంతం చోటుచేసుకుంది. రంగపురి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తండ్రే కూతుళ్లను హత్య చేసి, ఆపై తాను విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటనలో సల్ఫా మాత్రలు తాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురు కూతుళ్లలో ఒక కుమార్తె అంధురాలు. మరో కుమార్తె కూడా అంగవైకల్యంతో బాధపడుతోంది. సంఘటనా స్థలంలో సల్ఫేట్ సాచెట్లను పోలీసులు గుర్తించారు. ఒక గదిలోని డబుల్ బెడ్‌పై కుమార్తెల మృతదేహాలు పడి ఉండగా, రెండో గదిలో తండ్రి మృతదేహం లభ్యమైంది. అయిదుగురి నోటి నుండి తెల్లటి నురగ వచ్చినట్లు కనిపిస్తోంది. వీరందరి మెడకు ఎర్రటి దారం కట్టివుంది.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటి యజమాని, తండ్రి హీరాలాల్‌(50) కార్పెంటర్‌గా పనిచేస్తుండగా, ఏడాది క్రితం అతని భార్య క్యాన్సర్‌తో మృతిచెందింది. ఈ నెల 24 నుంచి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు  ఇంటి తాళం పగులగొట్టగా, వారికి లోపల ఐదు మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)