కుటుంబ పింఛనుకు సవతి తల్లి అనర్హురాలు 

Published on Fri, 09/19/2025 - 06:44

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) నిబంధనల ప్రకారం పింఛను ‘బహుమతి కాదు’, సవతి తల్లిని కుటుంబ పింఛనుకు అర్హురాలిగా పరిగణించలేమని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టపరంగా, బాంధవ్యం కోణంలో చూసినప్పుడు సవతి తల్లి కన్న తల్లికి భిన్నంగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. తల్లి అంటే కన్నతల్లి అనే అర్థంలోనే భావించాల్సి ఉంటుందని, సవతి తల్లిని కాదని తెలిపింది. నిర్వహణ, ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ఉన్నత న్యాయస్థానం గతంలో వివిధ సందర్భాల్లో ఇచి్చన తీర్పులను కేంద్రం ప్రస్తావించింది.

 పింఛను ప్రయోజనాలను కోరుకునే వ్యక్తి, సంబంధిత చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం స్పష్టమైన అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుందని గురువారం జస్టిస్‌ సూర్య కాంత్, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ కోటీశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. జోగి అనే ఉద్యోగి చిన్న తనంలోనే ఆరేళ్ల వయస్సు ఉండగా కన్నతల్లి చనిపోయింది. దీంతో, తండ్రి మరొకరిని వివాహం చేసుకున్నారు. సవతి తల్లి జయశ్రీ ఆయన్ను పెంచి పెద్ద చేశారు. 

జోగి 2008లో చనిపోయారు. ఆయనది ఆత్మహత్య అని ఐఏఎఫ్‌ తెలిపింది. కుటుంబ పింఛనుకు వచ్చే సరికి సవతి తల్లి అర్హురాలు కాదని ఐఏఎఫ్‌ స్పష్టం చేసింది. దీంతో, ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. తల్లి స్థానంలో తనకు కుటుంబ పింఛను ఇవ్వాలని కోరారు.  ఐఏఎఫ్‌ పింఛను నిబంధనలు–1961 ప్రకారం ఉద్యోగి చనిపోయిన పక్షంలో కుటుంబ పింఛనుకు..వితంతువు, చట్టబద్ధంగా వివాహం చేసుకున్న తండ్రి లేదా తల్లి, చట్టబద్ధ వారసుడైన కుమారుడు లేదా కుమార్తె అర్హులని స్పష్టం చేస్తోందని కేంద్రం వివరించింది. ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను నవంబర్‌ 20వ తేదీకి వాయిదా వేసింది.   

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)