Breaking News

అపూర్వ ఘట్టం, అరుదైన ఘనత : ప్రధాని మోదీ ప్రశంసలు

Published on Tue, 12/02/2025 - 17:55

 వారణాసి,  సాక్షి :  మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖీ (Devavrat Mahesh Rekhe) అరుదైన ఘనతను సాధించారు. శుక్ల యజుర్వేదం (మధ్యందిన శాఖ) నుండి దాదాపు 2,000 మంత్రాల అత్యంత సంక్లిష్టమైన పారాయణం ‘దండక్రమ పారాయణాన్ని’ పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. అద్భుతమైన ఆ వారణాసి అసాధారణమైన ఆధ్యాత్మిక క్షణాలకు వారణాసి వేదికగా నిలిచింది.  వేద సంప్రదాయంలో అత్యంత క్లిష్టమైన వాటిల్లో ఒకటిగా ఈ పారాయణాన్ని  భావించారు. దాదాపు 200 ఏళ్ల తర్వాత తొలిసారిగా శాస్త్రీయంగా ఈ కార్యక్రమం జరిగింది.

 ఈ పవిత్ర కార్యానికి గౌరవసూచకంగా, దేవవ్రతకు రూ.5 లక్షల విలువైన బంగారు కంకణం, రూ.1,11,116 విలువైన బంగారు కంకణాన్ని బహుకరించారు. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం , జగద్గురు శంకరాచార్యుల ఆశీస్సులతో ఈ గుర్తింపు లభించింది. 500 మందికి పైగా వేద విద్యార్థులు, సాంప్రదాయ సంగీతకారులు , శంఖ రావాల ప్రతిధ్వనుల మధ్య   వారణాసి పులకించిపోయింది.   భక్తులు వీధుల్లో బారులు తీరి, జల్లులు కురిపించారు ఈ వేడుకలో, శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతి తీర్థ మహాసన్నిధానం నుండి ఆస్థాన విద్వాన్ డాక్టర్ తంగిరాల శివకుమార్ శర్మ ప్రత్యేక ఆశీర్వాద సందేశాన్ని అందించారు. సంక్లిష్టమైన స్వర-నమూనాలు మరియు శబ్ద ఖచ్చితత్వానికి వేద పారాయణ కిరీటంగా గౌరవించబడే దండక్రమ  పారాయణం చరిత్రలో మూడు సార్లు మాత్రమే నిర్వహించబడిందని, దేవవ్రత పారాయణం దోషరహితంగా అతి తక్కువ సమయంలో పూర్తయిందని శృంగేరి మఠం అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు 
19 ఏళ్ల దేవవ్రత మహేష్ రేఖే అద్భుతమైన విజయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రశంసించారు. దేవవ్రతుడి విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్‌  చేశారు. భారతీయ సంస్కృతిని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆ యువ పండితుడు శుక్ల యజుర్వేదంలోని 2,000 మంత్రాలతో కూడిన దండక్రమ పారాయణాన్ని 50 రోజుల పాటు నిరంతరాయంగా పూర్తి చేశాడని తెలుసుకుని సంతోషిస్తారని ఆయన అన్నారు. ఇంతటి అసాధారణ ఆధ్యాత్మిక క్రమశిక్షణను కాశీ పవిత్ర నేలపై  జరగడం గర్వంగా ఉందన్నారు.  ఈ సందర్బంగా దేవవ్రతుడి కుటుంబం, సాధువులు, పండితులు, అతని కఠినమైన వేద అభ్యాసానికి దేశవ్యాప్తంగా  అతనికి మద్దతు ఇచ్చిన సంస్థల పట్ల గౌరవాన్ని ప్రకటించారు. వల్లభరం శాలిగ్రామ్ సంగ్వేద్ విద్యాలయంలో అక్టోబర్ 2 నుండి నవంబర్ 30 వరకు పారాయణం నిర్వహించారు. శృంగేరి పీఠం వేదపోషక సభ ఆధ్వర్యంలో శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖ పరీక్షల ప్రధాన పరిశీలకుడు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే యువ పండితుడు మరియు అతని తండ్రి-గురువు  వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే ఇద్దరినీ సాధువులు , వేద పండితులు ప్రశంసించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)