Breaking News

ఏందిరయ్యా ఇది.. 'స్పైడర్‌మ్యాన్'కు పోలీసుల షాక్‌!

Published on Sun, 08/24/2025 - 13:12

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వడానికి యువత.. అతిగా వ్యవహరిస్తున్నారు. ఒడిశాలో 'స్పైడర్‌మ్యాన్' వేషధారణలో బైక్‌పై స్టంట్లు చేసిన ఓ యువకుడికి పోలీసులు షాక్‌ ఇచ్చారు. రూ. 15,000 జరిమానా విధించారు. ఒడిశాలోని రౌర్కెలాలో ఈ ఘటన జరిగింది. "స్పైడర్‌మ్యాన్" డ్రెస్‌లో అధిక వేగంతో రోడ్డుపై బైక్ నడుపుతూ కనిపించాడు. కనీసం హల్మెట్‌ కూడా లేకుండా నేనే స్పైడర్‌మ్యాన్ అంటూ స్టంట్లు చేస్తూ.. వాహనదారులు, పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలిగించాడు.

పెద్దగా శబ్ధం చేసే విధంగా మోడిఫైడ్‌ లౌడ్ సైలెన్సర్‌తో హల్‌చల్‌ చేశాడు. ఆ యువకుడి ఓవర్‌యాక్షన్‌కు ట్రాఫిక్ పోలీసులు బ్రేక్‌లు వేశారు. అతని బైక్‌ను స్వాధీనం చేసుకుని రూ. 15,000 జరిమానా విధించారు.  హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, వేగం,  మోడిఫైడ్ లౌడ్ సైలెన్సర్‌ వాడినందుకు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది ఢిల్లీలో స్పైడర్‌మ్యాన్‌, స్పైడర్‌ ఉమెన్‌ దుస్తులు ధరించిన ఓ జంట బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ.. పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్లు తెలిసింది. ప్రమాదకరమైన విన్యాసాలు చేయడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించని కారణంగా ఢిల్లీ పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు 20 ఏళ్ల ఆదిత్య మరియు 19 ఏళ్ల అంజలి అని తెలుస్తోంది.

ఢిల్లీలోనే జరిగిన మరో ఘటనలో స్పైడర్‌మ్యాన్ వేషంలో ఉన్న ఒక వ్యక్తి ఎస్‌యూవీ బానెట్‌పై కూర్చొని విన్యాసాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న వ్యక్తిని నజాఫ్‌గఢ్ నివాసి ఆదిత్య (20) గా గుర్తించారు. మరో వైపు, వాహనం నడుపుతున్న వ్యక్తిని మహావీర్ ఎన్‌క్లేవ్ నివాసి గౌరవ్ సింగ్‌కు కూడా పోలీసులు జరిమానా విధించారు.

 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)