Breaking News

Kolkata: ‘స్పైస్‌జెట్’ అత్యవసర ల్యాండింగ్

Published on Mon, 11/10/2025 - 09:49

కోల్‌కతా: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి స్పైస్‌జెట్ విమానం  అత్యవసర ల్యాండింగ్ అయ్యిదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం కోల్‌కతాకు చేరుకుంటుండగా, విమానం ఇంజిన్లలో ఒకటి పనిచేయకపోవడాన్ని పైలట్‌ గుర్తించి, విమానాశ్రయంలో ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

విమానంలో తలెత్తిన సమస్యను గుర్తించిన పైలట్  తక్షణం కోల్‌కతా విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. తరువాత ముంబై నుండి కోల్‌కతాకు ప్రయాణికులను తీసుకెళ్తున్న ఎస్‌జీ 670 విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. రాత్రి 11:38 గంటలకు అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకున్నారు. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందితో కూడిన విమానాశ్రయ అత్యవసర ప్రతిస్పందన బృందాన్ని వెంటనే మోహరించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
 

గత నెలలో కోల్‌కతా నుండి శ్రీనగర్‌కు వెళ్లే ఇండిగో విమానం ఇంధన లీక్ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది.  ఆ ఇండిగో విమానం 6ఈ-6961లో 166 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారికి విమానయాన అధికారులు వసతి సౌకర్యం కల్పించారు. అవసరమైన మరమ్మతుల అనంతరం విమానం తిరిగి దాని గమ్యస్థానానికి చేరుకుంది. 

ఇది కూడా చదవండి: ‘హజ్‌’ కోటా నిర్థారణ.. ఎందరు వెళ్లొచ్చంటే..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)