Breaking News

ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించిన యూపీ కోర్టు

Published on Fri, 07/04/2025 - 01:14

మౌ: ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించింది. ఘోసి ఎమ్మెల్యే సుధాకర్‌ సింగ్‌పై దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన కేసుపై గురువారం మౌలో ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దొహారీఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ విద్యుత్‌ ఉప కేంద్రం వద్ద 1986లో విద్యుత్‌ కోతలకు నిరసనగా ఆందోళన జరిగింది.

 ఈ సమయంలో సుధాకర్‌ సింగ్‌ అధికారుల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు విధ్వంసానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్లో ఈ ప్రాంతం ఆజంగఢ్‌ జిల్లా పరిధిలో ఉండటంతో విచారణ చేపట్టిన ఆజంగఢ్‌ కోర్టు సింగ్‌కు బెయిలిచ్చింది. అనంతరం, ప్రత్యేక జిల్లాగా మారడంతో కేసు ఆజంగఢ్‌ నుంచి మౌకు మారింది. కేసు విచారణకు హాజరు కావడం లేదంటూ మౌ కోర్టు 2023లో సింగ్‌ను పరారీలో ఉన్న నేరగాడి ప్రకటించింది. తాజాగా, ఈ కేసును విచారించిన న్యాయస్థానం మరోసారి సింగ్‌ను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)