Breaking News

సోనియా గాంధీ భావోద్వేగ లేఖ!

Published on Thu, 02/15/2024 - 13:38

రాజ్యసభ ఎన్నికలకు సోనియా గాంధీ బుధవారం (ఫిబ్రవరి 14) నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభకు వెళుతుండటంపై పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో  సోనియా గాంధీ ఆ విమర్శలకు వివరణగా రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు.

‘ఢిల్లీలో మా కుటుంబం అసంపూర్ణంగా ఉంది. రాయ్‌బరేలీకి వచ్చి మిమ్మల్ని కలవడం ద్వారా దీనికి సంపూర్ణత ఏర్పడింది. ఈ సన్నిహిత సంబంధం ఎంతో పాతది. నా అత్తమామల నుండి నాకు అదృష్టంలా వచ్చింది’ అని సోనియా గాంధీ  ఆ లేఖలో రాశారు.

రాయ్‌బరేలీతో అనుబంధం..
‘రాయ్‌బరేలీతో మా కుటుంబ సంబంధాలు చాలా లోతుగా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో మీరు నా మామగారైన ఫిరోజ్ గాంధీని ఇక్కడి నుంచి గెలిపించారు. ఆయన తర్వాత నా అత్తగారు ఇందిరాగాంధీని కూడా ఇలానే ఢిల్లీకి పంపారు. నా జీవితంలోని ఒడిదుడుకులలలో మీ ప్రేమ, ఉత్సాహం దొరికింది’
 

గత రెండు దఫాల ఎన్నికల్లో..
‘నా అత్తగారిని, నా జీవిత భాగస్వామిని కోల్పోయిన తరువాత, నేను మీ వద్దకు వచ్చాను. మీరు నా కోసం ఆప్యాయంగా చేతులు చాచారు. గత రెండు దఫాల ఎన్నికల్లో మీరు నాకు అండగా నిలిచిన సంగతి మరచిపోలేను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది మీ కారణంగానే అని గర్వంగా చెబుతాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నించాను’

ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు..
‘ఇప్పుడు నా ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు కారణంగా నేను రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నిర్ణయం తీసుకున్నాక నేను మీకు నేరుగా సేవ చేసే అవకాశాన్ని పొందలేను. నా మనసులో ఈ వేదన అలానే ఉంటుంది. అయితే నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను మీరు ఆదుకున్నట్లే ఇకపై నన్ను, నా కుటుంబాన్ని ప్రతి కష్టంలోనూ మీరు ఆదుకుంటారని నాకు తెలుసు.పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు. త్వరలోనే కలుస్తానని వాగ్దానం చేస్తున్నాను’ అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)