Breaking News

మణిపూర్‌లో తక్షణమే శాంతి నెలకొనాలి

Published on Thu, 06/22/2023 - 05:56

న్యూఢిల్లీ: మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండపై కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. హింసాత్మక సంఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది నిరాశ్రయులు కావడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజలే నేడు శత్రువులుగా మారిపోవడం చాలా విచారకరమని అన్నారు. భిన్న వర్గాల ప్రజలను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న ఘన చరిత్ర మణిపూర్‌కు ఉందన్నారు.

ఈ మేరకు బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. రాష్ట్రంలో అందరూ సహనం వహించాలని విజ్ఞప్తి చేశారు. హింసకు తక్షణమే తెరపడాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. ఆప్తులను కోల్పోయినవారికి సానుభూతి తెలిపారు. మణిపూర్‌ హింసాకాండలో ఇప్పటిదాకా 100 మందికిపైగా మరణించినట్లు సమాచారం. వేలాది మంది సొంత ఊళ్లను వదలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)