Breaking News

రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని.. 27 ఏళ్ల కుమారుని హత్య!

Published on Mon, 08/28/2023 - 13:58

యూపీలోని మీరఠ్‌లో సర్ఘన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. ఒక తండ్రి తన స్నేహితులతో కలసి తన 27 ఏళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య కోసం ఆ తండ్రి కిరాయి హంతకులకు రూ.5 లక్షలు చెల్లించాడు. ఆ తండ్రి ముందుగా తన కుమారుని చేత మద్యం తాగించాడు. తరువాత హత్య చేసి, మృతదేహాన్ని బాగ్‌పత్‌లోని హిండన్‌ నదిలో పడవేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ తండ్రిని, హత్యకు సహకరించిన మిగిలినవారిని అరెస్టు చేశారు. 

వివరాల్లోకి వెళితే ఈ ఉదంతం ఛురా గ్రామంలో చోటుచేసుకుంది. కిరాయి హంతకులతో కుమారుడిని హత్య చేయించిన తండ్రి రిటైర్డ్‌ జవాను కావడం విశేషం. ప్రస్తుతం ఒక బ్యాంకులో గార్డుగా పనిచేస్తున్నాడు. తండ్రి (సంజీవ్‌ కుమార్‌) రెండవ వివాహం చేసుకోవడం కుమారునికి(సచిన్‌)ఇష్టం లేదు. ఈ నేపధ్యంలో తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

సంజీవ్‌.. అతని భార్య మునేష్‌ మధ్య గత 15 సంవత్సరాలుగా మనస్పర్థలు ఉండటంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వారి 27 ఏళ్ల ఏకైక కుమారుడు తల్లి మునేష్‌తో పాటు ఉంటున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మునేష్‌ దేవి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపధ్యంలో కుమారుడు సచిన్‌ ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లాడు. కుమారుడు ఎంతసేపటికీ ఆసుపత్రికి రాకపోవడంతో అనుమానంతో తల్లి మునేష్‌.. కుమారుని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తండ్రి సంజీవ్‌పై అనుమానం కలిగింది. వెంటనే వారు అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మొదట్లో తనకు తెలియదని బుకాయించినా, తరువాత తానే తన కుమారుడిని రూ. 5 లక్షలకు సుపారీ కుదుర్చుకుని హత్య చేయించానని ఒప్పుకున్నాడు. పోలీసులు సంజీవ్‌పై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 
ఇది కూడా చదవండి: నాలుగేళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)