Breaking News

కొందరు సరిగా పనిచేయట్లేదు! 

Published on Tue, 09/23/2025 - 05:55

న్యూఢిల్లీ: కొందరు హైకోర్టు న్యాయమూర్తులు వేగంగా కేసులను పరిష్కరించే వృత్తినైపుణ్యం ఉన్నా కూడా ఆ స్థాయిలో పనిచేయట్లేరని సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తంచేసింది. అలాంటి జడ్జీలపాలిట స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మాదిరి హితబోధ చెప్పే ఉద్దేశం తమకు లేదని, స్వీయసమీక్ష ద్వారా ఆ జడ్జీల తమ వైఖరిని మార్చుకోవాలని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం హితవు పలికింది.

 ‘‘హైకోర్టుల్లో రెండు రకాల జడ్జీలున్నారు. కొందరు జడ్జీలు పగలూరాత్రీ పనిచేస్తూ వేగంగా ఎక్కువ కేసులను పరిష్కరిస్తున్నారు. కొందరు జడ్జీలు మాత్రం దురదృష్టవశాత్తు సవ్యంగా సేవలు అందించట్లేదరు. కారణాలు మంచివైనా చెడ్డవైనా సరే పని మాత్రం సరిగా సాగట్లేదు. పరిస్థితులు ఎలాంటివనేది ఇక్కడ అప్రస్తుతం. ఒక జడ్జీ ఒక క్రిమినల్‌ కేసును ఆలకిస్తున్నారనుకుందాం. ఆయన రోజుకు 50 కేసులను పరిష్కరించాలని మేం అత్యాశపడట్లేదు. అలాగని ఆయన ఒక్క కేసు విచారించి గొప్ప పని చేశాననుకుంటే పద్ధతి కాదు. 

బెయిల్‌ కేసులో రోజుకు ఒకే ఒక్క కేసును విచారిస్తూ కూర్చుంటా అంటే అది ఆయన ఆత్మపరిశీలనకే వదిలేయాలి. తమ వద్ద కేసుల పెండింగ్‌ల కొండ పేరుకుపోకుండా జడ్జీలు చూసుకోవాలి. ఆ మేరకు స్వీయ నియంత్రణ ఉండాలి. వృత్తిపరంగా నాణ్యమైన కార్యశీలత అనేది తప్పనిసరి. రోజుకు పరిష్కరించే ఎక్కువ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోవాలి. దాంతోపాటే కేసుల పరిష్కార విధానంలో అత్యున్నత న్యాయప్రమాణాలు, నియమనిబంధనలను పాటించాల్సిందే. 

ఈ విషయంలో హైకోర్టు జడ్జీలకు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మాదిరి పాఠాలు చెప్పే యోచన మాకు లేదు. మన ముందు ఎంతటి పెండింగ్‌ కేసుల భారం ఉంది, ఎంత త్వరగా ఆ భారాన్ని తగ్గించుకోవాలని అనే స్పృహ జడ్జీలకు ఉండాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమపై నమోదైన క్రిమినల్‌ కేసుల్లో వాదోపవాదనలు ముగిసి తీర్పులు జార్ఖండ్‌ హైకోర్టులో ఏళ్ల తరబడి రిజర్వ్‌లోనే ఉండిపోవడంతో విసిగిపోయిన ఆ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉదంతంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది.  

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)