Breaking News

కారులో ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్‌ కౌర్‌ మృతదేహం.. రంగంలోకి పోలీసులు

Published on Thu, 06/12/2025 - 13:11

భఠిండా: పంజాబ్‌లో దారుణం వెలుగు చూసింది. లూధియానాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం రాత్రి  అదేష్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన కారులో ఆమె మృతదేహం  పోలీసులకు లభ్యమయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని  ఇక్కడ కారులో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పార్క్ చేసిన కారు నుండి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు లోపల కౌర్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ కారు లూధియానా జిల్లాలో రిజిస్ట్రర్‌ అయిన కారు అని సమాచారం. కౌర్‌కు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో  3.83 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె చేసే రీల్స్  ఎంతో ఆదరణ పొందాయి. అయితే ఆమె అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తారనే ఆరోపణలున్నాయి.

ప్రాథమికంగా దీనిని హత్యకేసుగా పరిగణిస్తున్నామని  బఠిండా పోలీస్ సూపరింటెండెంట్ అమ్నీత్ కొండల్ తెలిపారు. సంఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. నిందితులు కౌర్‌ను వేరే ప్రాంతంలో హత్య చేసి,  మృతదేహాన్ని విశ్వవిద్యాలయ పార్కింగ్ స్థలంలోని కారులో ఉంచారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: హనీమూన్‌ కేసు: సోనమ్‌ను సిట్‌ అడగబోయే 20 ప్రశ్నలివే..
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి