Breaking News

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్?

Published on Fri, 12/26/2025 - 21:28

సోషల్ మీడియా ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనిలో మునిగిపోతున్నారు. పిల్లల్లో అయితే సామాజిక మాధ్యమాల ఎఫెక్ట్ మరింత అధికంగా ఉంటుంది. అయితే మద్రాస్ హైకోర్టు పిల్లల్లో సోషల్ మీడియా వాడకంపై కీలక సూచన చేసింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు వాటిని వాడకుండా  నియంత్రించాలని  సూచించింది.  

పిల్లల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. మానసికంగా, శారీరకంగా ఎదగాల్సిన వయస్సులో గంటల గంటలు ఫోన్‌లకు అతుక్కపోయి వాటిలోనే గడపడంతో ఆందోళన, డిఫ్రెషన్, ఒత్తిడి తదితర సమస్యలు చిన్న వయసులోనే వెలుగు చూస్తున్నాయి. వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు ఫోన్‌లకు దూరం చేద్దామని ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో మద్రాస్  హైకోర్టు తెలిపింది.

16  ఏళ్ల లోపు పిల్లలకు  సోషల్ మీడియా ఖాతాలకు అనుమతించకుండా చట్టం రూపొందించాలని  కోర్టు పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఈ మధ్య  ఇటువంటి చట్టం రూపొందించారని భారత్‌లో సైతం ఈ విషయం ఆలోచించాలని తెలిపింది. తద్వారా హానికరమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను పిల్లలు చూడకుండా నియంత్రిచవచ్చని  పేర్కొంది. 

అదేవిధంగా అటువంటి కఠిన చట్టాలు రూపొందించే వరకూ పిల్లలు ఇంటర్నెట్‌ను సురక్షితంగా వాడేలా రాష్ట్ర ప్రభుత్వం, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా ఓ కార్యాచరణ సిద్ధం చేయాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)