భార్య‌ను కాటేసిన‌ పాము.. ఆసుప‌త్రికి తీసుకెళ్లిన‌ భ‌ర్త ఏం చేశాడంటే

Published on Wed, 07/10/2024 - 12:06

సాధారణంగా పామును చూస్తేనే దానికి దూరం ప‌రుగెత్తుతారు. ఒక‌వేళ పాము కాటుకు గురైతే  భయపడిపోయి ప్రాణభయంతో వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి పరుగుతీస్తాం. కానీ బీహార్ ఓ వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన మ‌హిళ‌ను ఆమె భ‌ర్త ఆసుప‌త్రికి తీసుకురాగా ఆమెతోపాటు  కాటు వేసిన పామును కూడా తీసుకురావడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు.

సబౌర్‌లోని జుర్‌ఖురియా గ్రామంలో నిషా అనే మ‌హిళ‌ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురైంది. సాయం కోసం కేకలు వేయడంతో, భ‌ర్త రాహుల్ ఆమె ద‌గ్గ‌ర‌కు ప‌రుగెత్తుకొచ్చాడు. ఈ లోపు పాము పారిపోతుంటే దాని వెంట వెళ్లి ఇంట్లో దేవుడి ఫోటోల వెన‌క్కి న‌క్కిన పాము క‌నిపించింది.

వెంటనే కర్రతో దానిని తీసి బకెట్‌లో వేశాడు. అప్ప‌టికే  నిషా స్పృహ తప్పి పడిపోవ‌డంతో ఆమెను త‌న బైక్‌పై కూర్చోబెట్టి, బ‌కెట్‌లో పాముతోపాటు బైక్ హ్యాండిల్‌కు వేలాడ‌దీశాడు. భాగల్పూర్ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన త‌ర్వాత వైద్యులు మొదట పామును చూసి భ‌య‌ప‌డిపోయారు.

అయితే ఆ పాము తన భార్య‌ను క‌రిచింద‌ని చెబుతూ.. ఆమెను కాపాడాల్సిందిగా వైద్యుల‌ను వేడుకున్నాడు నిషా భ‌ర్త‌.. అనంత‌రం దానిని దూరంగా ఉంచమని చెప్పి..  మ‌హిళ‌ను చికిత్స కోసం అత్యవసర విభాగానికి పంపారు. ఆ పాము విషాన్ని అంచనా వేయడం ద్వారా ఆమెకు వైద్యులు చికిత్స చేశారు. ప్ర‌స్తుతం నిషా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పామును మ‌ళ్లీ అడ‌విలో విడిచిపెట్టారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)