Breaking News

‘యుద్ధానికి రాకుంటే ఏం చేయగలం?’: రాహుల్‌పై స్మృతి సంచలన వ్యాఖ్యలు

Published on Thu, 07/24/2025 - 09:15

న్యూఢ్లిల్లీ: ‘2024లో గాంధీ కుటుంబం నాతో పోరాడేందుకు నిరాకరించింది. వారు యుద్ధభూమిలోకి కూడా దిగనప్పడు నేను ఏమి చేయగలను? ఇకపై నేను వారిని వెంటాడను’ అంటూ బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇండియా టుడే టీవీతో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీపై మాటల దాడి చేయడం తన బాధ్యతల్లో భాగం కాదని  అన్నారు. 

రాహుల్ గాంధీపై ఈ మధ్య కాలంలో ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి పోటీచేసి,  గాంధీ కుటుంబపు కోటను కొల్లగొట్టానని, 2024లో కూడా రాహుల్ గాంధీ తనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఉంటే, తాను ఆయనను ఖచ్చితంగా ఓడించగలనని ఆమె పేర్కొన్నారు. ఓటమి భయంతోనే రాహుల్‌ అమేథి నుండి పోటీ చేయలేదని స్మృతి విమర్శించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో, కాంగ్రెస్ అమేథి నుంచి కేఎల్ శర్మను అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన ఇరానీని ఓడించారు.  రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌తో పాటు  యూపీలోని రాయ్‌బరేలి నుండి కూడా పోటీచేసి గెలుపొందారు. 

అమేథీ అంత తేలికైన స్థానం కాదని చరిత్ర తెలియజేస్తోంది. శరద్ యాదవ్ వంటి సీనియర్ నేతలే అక్కడ ఓడిపోయారు. మేనకా గాంధీ కూడా అమేథీ నుండి ఓడిపోయాయరని స్మృతి ఇరానీ గుర్తుచేశారు. ఓటమి ఎదురవుతుందనే సీటును ఏ తెలివైన నాయకుడు ఎంచుకోడు. అయితే పార్టీ  ఆదేశిస్తే దానిని విధిగా అంగీకరిస్తారు. 2019లో తాను అసాధ్యాన్ని సుసాధ్యం చేశానని అని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల నుండి దూరమవుతున్నాననే వార్తలను స్మృతి తోసిపుచ్చారు. టీవీ సిరీస్ ‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ’లో తిరిగి తులసి పాత్రలో కనిపిస్తూ అలరిస్తున్నానని తెలిపారు. భవిష్యత్‌లో పార్టీ తనకు ఏ బాధ్యత  అప్పగిస్తుందో తెలియదని స్మృతి అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)