Breaking News

జిమ్‌కే వెళ్లక్కరలేదు.. చిన్న మార్పులు చాలు, షుగర్‌ దిగొస్తుంది!

Published on Thu, 11/13/2025 - 16:47

World Diabetes Day November 14th మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహార నియమాలతోపాటు, తేలికపాటి వ్యాయామం కూడా అవసరం. క్రమం తప్పకుండా, ఎక్సర్‌సైజ్‌, వాకింగ్‌, యోగా లాంటి చేయడం వలన షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.  ఇందుకోసం జిమ్‌ సభ్యత్వం, ఫ్యాన్సీ గాడ్జెట్‌లపై ఆధారపడ వలసిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులే, చిన్న పాటి వ్యాయామాలే ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. 

నడక, స్ట్రెచింగ్‌, స్క్వాట్‌లు లేదా వాల్ పుష్-అప్‌లు వంటి సాధారణ కదలికలు జీవక్రియకు అద్భుతాలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.అంటే ఇన్సులిన్ సహాయం లేకుండానే, కండరాలు రక్తం నుండి నేరుగా గ్లూకోజ్‌ను గ్రహిం చేందుకు ఇవి ఉపయోగపడతాయి.  

వ్యాయామం చేసినప్పుడు,  కండరాల్లోని  మైటోకాండ్రియా  పవర్‌హౌస్‌లను మేల్కొల్పుతాయి. ఇవి చక్కెర , కొవ్వు రెండింటినీ బర్న్‌ చేస్తాయి. తద్వారా అదనపు గ్లూకోజ్‌ను క్లియర్ చేయడంతోపాటు, ఇన్సులిన్ నిరోధకతను కలిగించే  అదనపు కొవ్వును కరిగిస్తుంది.

రెగ్యులర్ వ్యాయామం PGC-1 ఆల్ఫా అని పిలిచే ప్రత్యేక ప్రోటీన్‌ను పెంతుంది. ఇది మైటోకాండ్రియల్ పెరుగుదలను పెంచుతుంది. క్రమంగా ఈ ప్రక్రియ భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. దీర్ఘకాలిక జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.

తేలికపాటి వ్యాయామాలు
చురుకైన నడక (Brisk Walk): భోజనం తర్వాత పదిహేను నిమిషాలు కండరాలు చక్కెరను గ్రహించడంలో సహాయ పడతాయి.
వాల్ పుష్-అప్‌లు: సున్నితమైనవేకాన ఎగువ శరీరం ,రక్త ప్రవాహానికి ప్రభావవంతంగా ఉంటాయి.
స్క్వాట్‌లు  అండ్‌ లంగెస్‌ (Squats and lunges) కాళ్లను బలోపేతం చేస్తాయి . గ్లూకోజ్ తీసుకోవడంలో మద్దతు ఇస్తాయి.
లైట్ స్ట్రెచింగ్ అండ్‌ యోగా: మనస్సును ప్రశాంతపరుస్తాయి . ఒత్తిడి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.
రెసిస్టెన్స్ బ్యాండ్ శిక్షణ: కండరాలను బలంగా  చేస్తుందీ  వ్యాయామం. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.
సోలియస్ పుష్-అప్‌లు: కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను పైకి  కిందికి కదలించేలా  చేసే వ్యాయామం.

క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు అడ్రినలిన్, నోరాడ్రినలిన్,అడిపోనెక్టిన్‌ను పెంచుతుంది, ఇవన్నీ రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఒత్తిడి హార్మోను కార్టిసాల్‌ను కూడా తగ్గిస్తాయి. అధికసుగర్‌స్థాయిలు అనారోగ్యానికి మూలం అని గమనించండి! మరింకెందుకు ఆలస్యం, హాయిగా ఆరోగ్యంగా ఉండాలన్నా, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఈ క్షణం నుంచే వ్యాయామ నియమాన్ని పాటించండి!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)