Breaking News

పార్లమెంట్‌లో పేలిన హుండీ చోరీ స్కిట్‌

Published on Fri, 07/31/2026 - 12:58

సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట  శుక్రవారం కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఆ పార్టీ ఎంపీ పప్పూయాదవ్‌ కాషాయ వస్త్రాలు ధరించారు. పూజారి వేషంలో విరాళాల పెట్టె పట్టుకొని ముఖద్వారం వద్ద కూర్చొని నిరసన తెలిపారు.ఆ సమయంలో అక్కడి ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరుస్తూ హుండీలో కానుకలు వేశారు.

హుండీలో కానుకలు 
పూజారి వేషంలో వచ్చిన పప్పూ యాదవ్‌ మంత్రాలు చదువుతూ పార్లమెంటు ఎదుట ముఖద్వారం వద్ద విరాళాల పెట్టె పట్టుకొని కూర్చున్నారు. దీంతో ఎంపీలంతా ఒక్కొక్కరిగా అతనికి హుండీలో విరాళాలు వేశారు. ఈ సందర్బంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ పప్పూయాదవ్‌కు నమస్కారం పెట్టి హుండీలో కానుకలు వేశారు. ఈ నిరసనలో ఎంపీలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీలు "అమిత్ షా పార్లమెంటుకు ఎందుకు గైర్హాజరయ్యారు?" అని రాసి ఉన్న బ్యానర్లను  ప్రదర్శించారు.

రామమందిర చోరీ కేసు

జూన్ 2026లో వెలుగులోకి వచ్చిన అయోధ్య రామాలయ హుండీ చోరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆలయ లెక్కింపు సిబ్బంది, ఇతర నిందితులు కలిసి సుమారు రుూ. ఏడు  కోట్ల నుండి రూ. 7.5 కోట్ల వరకు విరాళాల సొమ్మును కాజేసినట్లు ప్రాథమిక నివేదికలు తెలిపాయి. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఈ సందర్భంగా ఎంపీ డింపుల్‌ యాదవ్ మాట్లాడుతూ  "అయోధ్య విరాళాల చోరీ వెనుక బడా నేతలు ఉన్నారు. చిన్న చిన్న వ్యక్తులను జైల్లో  వేస్తున్నారు. వేల కోట్ల రూపాయల చందా చోరీ జరిగింది. రసీదులు ఇవ్వకుండా పెద్ద ఎత్తున విరాళాలు చోరీ చేశారు. చాలామంది బంగారం వెండి నాణేలు కూడా ఇచ్చారు. వాటి వివరాలు లేవు. భక్తిశ్రద్ధలతో ఇచ్చిన విరాళాలను దొంగతనం చేశారు. విరాళాల చోరీ పైన పార్లమెంట్లో చర్చ జరగాలి. భక్తుల  విశ్వాసంతో ఆటలాడుకుంటున్నారు విరాళాల చోరీ అంశాన్ని రాబోయే ఎన్నికల  ఎజెండాగా మారుస్తాం" అని అన్నారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)