Breaking News

వార్తల్లోకెక్కిన శ్రీకార్యం బస్టాండ్‌.. కూల్చేసిన ప్రభుత్వం

Published on Sat, 09/17/2022 - 10:39

తిరువనంతపురం: ఏమాత్రం సిగ్గుపడకుండా అబ్బాయి వడిలో అమ్మాయిలు కూర్చుని ఆ మధ్య సోషల్‌ మీడియాలో ఫొటోలు తెగ వైరల్‌ అయ్యాయి. స్థానికులు ఓ బస్టాండ్‌లో చేసిన పనితో.. మండిపోయిన కాలేజీ స్టూడెంట్స్‌ ఈ ట్రెండ్‌ను పుట్టించారు.  అయితే వార్తల్లో చర్చనీయాంశంగా మారిన ఆ బస్టాండ్‌ను.. రెండు నెలల తర్వాత ఇప్పుడు కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు.

అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చుంటున్నారంటూ తిరువనంతపురం శ్రీకార్యం బస్టాండ్‌ బెంచ్‌ను మూడు ముక్కలు చేశారు స్థానికులు. ఇది నచ్చని కొందరు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు.. ఆ మూడు ముక్కలపై ఒళ్లో కూర్చుని ఫొటోలు పెట్టి వైరల్‌ చేశారు. అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చున్న ఫొటోలు తెగ ట్రెండ్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఆ బస్‌ షెల్టర్‌ను తాత్కాలికంగా సీజ్‌ చేశారు పోలీసులు.  జులైలో ఈ ఘటన జరిగింది.


అయితే ఈ విషయం ప్రభుత్వం దాకా వెళ్లడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ బస్టాండ్‌ను పడగొట్టాలని నిర్ణయించడంతో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ స్థానంలో కొత్త బస్టాండ్‌ను, అదీ లింగ వివక్షకు తావు లేకుండా ఉండేలా చూస్తామని విద్యార్థులకు మాటిచ్చారు మేయర్‌ ఆర్య రాజేంద్రన్‌. స్థానికులు చేసిన ఆ పని అనవసరమైందని, ప్రొగ్రెసివ్‌ స్టేట్‌గా పేరున్న కేరళలలో ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. అలాగే.. అబ్బాయిలు-అమ్మాయిలు కలిసి కూర్చోవడంపై రాష్ట్రంలో ఎలాంటి నిషేధం లేదన్న ఆమె.. అలా కనిపించిన వాళ్లను వేధించే సంస్కృతి ఏనాడో అంతరించిపోయిందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: వాళ్లు చదువుకునేలా ఏదైనా సాయం చేయండి

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)