Breaking News

శుభాంశు బిజీబిజీ 

Published on Sun, 07/06/2025 - 05:35

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కు చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన విధుల్లో బిజీగా మారారు. ఒకరోజు విశ్రాంతి తర్వాత తన ‘ఐఎస్‌ఎస్‌ పదోరోజు’పనుల్లో భాగంగా సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో మనిషి ఎముకల సాంద్రత ఎలా ఉంటుంది? అనే అంశంపై ఆయన పరిశోధనలు మొదలుపెట్టారు. భారరహిత స్థితిలో ఎముకలో కణాల పుట్టుక, అభివృద్ధి, వాపు అంశాలపైనా శుక్లా శోధన సాగించారు. 

దీర్ఘకాలంపాటు ఖగోళయానం చేస్తే రేడియోధార్మీకత కారణంగా వ్యోమగాముల కణాల్లో డీఎన్‌ఏ నిచ్చెనలు దెబ్బతింటే అవి మళ్లీ మరమ్మతులు చేసుకోవాలంటే భూమి గురుత్వాకర్షణ అవసరం. కానీ ఐఎస్‌ఎస్‌లో అత్యంత స్వల్పస్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అలాంటప్పుడు రేడియేషన్‌ ప్రభావ స్థాయిలు ఎలా ఉంటాయనే దానిపై శుక్లా అధ్యయనం మొదలెట్టారు.

 నీటి ఎలుగుబంటి(టార్డీగ్రేడ్‌)తోపాటు శైవలాలు శూన్యస్థితిలో ఎలా పెరగగలవు? అనే అంశంపై ప్రయోగంచేశారు. వాటర్‌బేర్‌ల ఉనికి, పునరుజ్జీవం, పునరుత్పత్తి విధానాల్లో మార్పులను ఆయన గమనించారు. ఈ సూక్ష్మజీవాలు భవిష్యత్తులో సుస్థిర జీవనానికి, ఆహారం, ఇంధనంతోపాటు పీల్చేగాలికి ఊపిరులూదొచ్చు. అయితే తొలుత భారరహిత స్థితిలో ఈ అతిసూక్ష్మజీవాలు ఎలా మనుగడ సాగిస్తాయో తెల్సుకోవాల్సి ఉంది’’అని యాగ్జియం స్పేస్‌ సంస్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

‘‘శుక్లాతోపాటు యాగ్జియం బృంద సభ్యులు ఎముక శూన్యంలో ఎలా పెళుసుబారుతుంది? భూమి మీదకు రాగానే ఎలా పూర్వస్థితిని చేరుకుంటుంది? అనే దానిపైనా ప్రయోగంచేశారు. ఆస్టియోపోరోసిస్‌ వంటి ఎముక సంబంధ వ్యాధులకు మరింత మెరుగైన చికిత్సావిధానాల అభివృద్ధికి తాజా ప్రయోగాలు దోహదపడతాయి’’అని యాగ్జియం స్పేస్‌ తెలిపింది. 

శూన్య స్థితిలో అస్థిపంజరంలోని కండరాలు ఎందుకు సూక్ష్మస్థాయిలో స్థానభ్రంశం చెందుతాయనే అంశంపైనా శుక్లా పరిశోధన చేశారు. చాలా రోజులపాటు అంతరిక్షయాత్రల్లో భాగంగా ఐఎస్‌ఎస్‌లో గడిపే వ్యోమగాములను కండరాల క్షీణత పట్టిపీడిస్తుంది. దీనికి కణస్థాయిలో పరిష్కారం కనుగొనేందుకు శుక్లా ప్రయత్నించారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు