Breaking News

క్వారంటైన్‌లోకి శుభాన్షు

Published on Wed, 05/28/2025 - 07:41

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లాకు చివరి ఐసోలేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఆగ్జియం మిషన్‌–4 (యాక్స్‌–4)కు సన్నాహకంగా ముగ్గురు సహచరులతో కలిసి కలిసి ఆయన ప్రీ–లాంచ్‌ క్వారంటైన్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆగ్జియం స్పేస్‌ ఉద్యోగులు వారికి వీడ్కోలు సమావేశం నిర్వహించారు. మిషన్‌ విజయవంతమవుతుందని శుక్లా ధీమా వెలిబుచ్చారు.

ఈ మిషన్‌ను జూన్‌ 8న అమెరికాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించనున్నారు. నాసా సీనియర్‌ వ్యోమగామి, ఆగ్జియం స్పేస్‌ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ డైరెక్టర్‌ పెగ్గీ విట్సన్‌ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. నౌకకు పైలట్‌గా వెళ్తున్న శుక్లా ఐఎస్‌ఎస్‌లో అడుగు పెట్టిన తొలి భారతీయ వ్యోమగామి కానున్నారు. వీరితో పాటు పోలండ్‌కు చెందిన స్లావోజ్‌ ఉజ్నాన్‌స్కీ– విస్నియోవ్‌స్కీ, హంగేరీకి చెందిన టిబోర్‌ కాపు బృందంలో ఉన్నారు. వారిద్దరికీ కూడా ఇది తొలి అంతరిక్షయానం. అలా ఈ మిషన్‌ భారత్‌కే గాక పోలండ్, హంగరీలకు కూడా ఎంతో ముఖ్యమైనది.

ఐసోలేషన్‌ ఎందుకు?
ప్రీ లాంచ్‌ క్వారంటైన్‌ వ్యోమగాములకు కీలకమైన ప్రొటోకాల్‌. అంతరిక్షంలో గడపటం పలు సవాళ్లతో కూడిన విషయం. వ్యోమగాములకు అనారోగ్యం వంటివి ఉంటే అది మిషన్‌నే కాకుండా ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములనూ ప్రభావితం చేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి లేని చోట వ్యోమగాముల రోగని రోధక శక్తి మరింత బలహీనపడి ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదముంటుంది. అందుకే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి దీనిని నిర్వహిస్తారు. ప్రయోగానికి 14 రోజుల ముందుకాలం క్వారంటైన్‌ ఉంటుంది. ఈ సమయంలో వ్యోమగాములు ప్రయోగ ప్రదేశానికి సమీపంలో ఉంటారు. ఒక చిన్న సహాయక బృందం కూడా వారికి అందుబాటులో ఉంటుంది. కఠినమైన ఒంటరితనం, మెరుగైన పరిశుభ్రత చర్యలు, రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణ ఉంటాయి. తుది మిషన్‌ బ్రీఫింగ్‌లు, శిక్షణ, వ్యాయామాలు నిర్వహిస్తారు. సిబ్బందిలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వారిని మరింత ఒంటరిగా ఉంచి నిశితంగా పర్యవేక్షిస్తారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)