Breaking News

కర్ణాటకలో అంబులెన్స్‌ బీభత్సం.. భయంకర దృశ్యాలు వైరల్‌

Published on Wed, 07/20/2022 - 20:46

బెంగళూరు: కర్ణాటలో ఓ అంబులెన్స్‌ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న అంబులెన్స్‌ అదుపు తప్పి టోల్‌బూత్‌ను ఢీకొట్టింది. ఉడిపి జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. కుందాపురం నుంచి రోగిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అప్పటికే వర్షం పడుతుండటంతో టోల్‌ గేట్‌ వద్ద సిబ్బంది బారికేడ్లను అడ్డంగా పెట్టారు. అయితే ఇంతలో అంబులెన్స్‌ అటుగా రావడాన్ని గమనించిన సిబ్బంది టోల్‌ ప్లాజా ముందు ఉన్న రెండు బారికేడ్లను వేగంగా తొలగించారు.

అంబులెన్స్‌ టోల్‌గేట్‌కు దగ్గరగా రావడంతో చివర ఉన్న మూడో బారికేడ్‌ను తొలగించేందుకు ఓ సిబ్బంది ప్రయత్నించాడు. అప్పటికే అతి వేగంతో వస్తున్న అంబులెన్స్‌ వర్షం పడి తడిగా ఉన్న రోడ్డుపై అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా వాహనం టైర్లు టర్న్‌ అవ్వడంతో టోల్‌బూత్‌ క్యాబిన్‌ వైపు దూసుకెళ్లి బొల్తా కొట్టింది. అంబులెన్స్‌లోని పరికరాలు అన్ని చెల్లాచెదురుగా ఎగిరి పడ్డాయి.
చదవండి: వావ్‌ వాట్‌ ఏ టాలెంట్‌.. మైకెల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టిన కార్మికుడు

ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఒక రోగి, ఇద్దరు సహాయకులతోపాటు రోడ్డుపై ఉన్న టోల్‌గేట్‌ సిబ్బంది మరణించారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ మాత్రం గాయాలతో బయటపడగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ప్రమాద తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)