Breaking News

మంచి భర్త అనుకున్నా.. నరకం చూపారు

Published on Fri, 11/28/2025 - 07:39

కర్ణాటక: భర్త వేధింపులను తట్టుకోలేక భద్రా నీటి కాలువలోకి దూకిందో నవ వివాహిత. జిల్లాలో భద్రావతి తాలూకా సిద్ధాపుర వద్ద ఈ సంఘటన జరిగింది. తన బాధను హృదయవిదారకంగా డెత్‌నోట్‌లో రాసిపెట్టింది. వివరాలు... భద్రావతి తాలూకా డీబీ హళ్లికిచెందిన పరమేశ్వర, రుద్రమ్మ దంపతుల కుమార్తె లత (22). ఈ ఏడాది ఏప్రిల్‌లో శికారిపుర తాలూకా దిండదహళ్లి గ్రామానికి చెందిన గురురాజ్‌తో ఆమెకు పెద్దలు ఘనంగా పెళ్లిచేశారు. విద్యుత్‌ శాఖ (కేపీసీఎల్‌)లో గురురాజ్‌ ఏఈఈగా ఉద్యోగం చేస్తాడు. పెద్ద ఉద్యోగి దొరికాడు అని భార్య, అత్తమామలు సంతోషిస్తే, అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. భర్త, అత్తమామల వేధింపులను తట్టుకోలేక బుధవారం కాలువ వద్దకు చేరుకుని మొబైల్‌ఫోన్‌ గట్టున పెట్టి దూకేసింది. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.  

డెత్‌నోట్‌లో కన్నీటి వరద 
మెట్టినింట్లో వేధింపుల గురించి లత డెత్‌నోట్‌లో వివరంగా రాసింది. నా చావుకు భర్త గురురాజ్, అత్త నాగరత్నమ్మ, బంధువులు రాజేశ్వరి, శారదమ్మ,  కృష్ణప్ప కారణం. ఈ ఐదుగురు నన్ను మానసికంగా వేధించారు. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నా అని పొంగిపోయాను, కానీ అతడు తల్లిదండ్రుల మాటలు విని నాతో నాటకీయంగా ప్రవర్తించేవాడు. ఎన్నో అవమానాలు అనుభవించాను. ప్రతి మహిళ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మంచి భర్త దొరకడు. ఎన్నో కలలతో అత్తింటిలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ సర్దుకుపోవాలి. భార్యకు కనీసం భర్త అయినా మద్దతుగా ఉండాలి. ఇంట్లోని వారితో పాటు భర్త కూడా ద్వేషం చూపిస్తే ఆ మహిళకు చావుతో సమానం. రోజురోజుకీ చస్తూ బతకడం సాధ్యం కాదు.  నా చావుకు న్యాయం చేయాలి అని  చివరి కోరిక కోరింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)