Breaking News

దెయ్యం విడిపిస్తానని.. ప్రాణం తీసింది

Published on Wed, 07/09/2025 - 12:33

కర్ణాటక: దెయ్యం పట్టిందని తీవ్రంగా హింసించడంతో ఓ మహిళ మరణించిన ఘటన జిల్లాలోని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు సమీపంలోని జంబరగట్టె గ్రామంలో జరిగింది. మృతురాలు గీతమ్మ (55). వివరాలు.. ఆదివారం సాయంత్రం మృతురాలు గీతమ్మ అసహజంగా ప్రవర్తించింది. ఆమె కుమారుడు సంజయ్‌ అదే గ్రామానికి చెందిన నిందితురాలు ఆశ (45)ను ఇంటికి పిలిపించాడు. గీతమ్మకు దెయ్యం పట్టిందని, విడిపిస్తానని ఆశా చెప్పింది.

 ఆశా తనకు చౌడమ్మ దేవి పూనిందంటూ గీతమ్మకు పట్టిన దెయ్యం వదిలిపో అంటూ చర్నాకోలు తీసుకుని కొట్టడం ప్రారంభించింది. రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హళేజంబర ఘట్టె చౌడమ్మ గుడి వరకు ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లింది. అయినా దెయ్యం వదిలిపోలేదంటూ తెల్లవారుజామున 2.30 గంటల వరకు చితకబాదుతూనే ఉంది.

 దాడితో తీవ్రంగా అస్వస్థురాలైన గీతమ్మ కుప్పకూలింది. దయ్యం వదలడం ఏమో గానీ ఆమె ప్రాణం వదిలిపోయింది. ఆమె స్పృహ తప్పి పడిపోయిందనుకున్న ఆశ.. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా సర్దుకుంటుంది అని చెప్పి వెళ్లిపోయింది. కళ్లు తెరవకపోవడంతో కొడుకు గీతమ్మను హొళెహొన్నూరులోని సముదాయ ఆస్పత్రికి తరలించగా చనిపోయిందని వైద్యులు తెలిపారు. గీతమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కాగా గీతమ్మపై జరిగిన దాడి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పోలీసులు ఆశను అరెస్టు చేశారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)