Breaking News

48 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలుపు!

Published on Wed, 06/05/2024 - 08:07

ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీయే కాదు.. అత్యల్ప మెజారిటీ కూడా నమోదైంది. మహారాష్ట్రలోని ముంబై వాయవ్య నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వెలువడింది. శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) వర్సెస్‌ శివసేన (సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని పార్టీ) పోరు హోరాహోరీగా సాగింది. 

ఈ పోరులో చివరి వరకు విజయం ఇరుపక్షాల మధ్య దోబూచులాడింది. చివరకు కేవలం 48 ఓట్ల అతితక్కువ మెజారిటీతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయ్‌కర్‌ తన సమీప ప్రత్యర్థి అమోల్‌ కీర్తికర్‌పై గెలుపొందారు. వాయ్‌కర్‌కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్‌కు 4,52,596 ఓట్లు లభించాయి. రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం ఇరు పారీ్టల అభ్యర్థుల మధ్య మారుతూ వచి్చంది. 

ఒక రౌండ్‌లో అయితే అమోల్‌ కేవలం ఒక ఓటుతో ఆధిక్యంలో కాసేపు కొనసాగారు. ఈ ఎన్నికల్లో కేరళలోని అత్తింగల్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అదూర్‌ ప్రకాశ్‌ కేవలం 684 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌ రూరల్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్‌ 1,615 ఓట్ల తేడాతో గెలిచారు. చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి భోజ్‌రాజ్‌ నాగ్‌ 1,884 ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్‌ రాజ్‌పుత్‌ 2,678 ఓట్ల తేడాతో నెగ్గారు. 

#

Tags : 1

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)