Breaking News

పప్పు చెడిపోయిందని క్యాంటిన్‌ కాంట్రాక్టర్‌పై దాడి

Published on Wed, 07/09/2025 - 11:49

ముంబై: పాడైపోయిన భోజనం పెట్టారన్న కారణంతో క్యాంటిన్‌ కాంట్రాక్టర్‌పై అధికార కూటమి ఎమ్మెల్యే దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ ముంబైలోని ఎమ్మెల్యేల హాస్టల్‌ క్యాంటిన్‌లో రాత్రి భోజనం కోసం వచ్చారు. ఆయనకు వడ్డించిన పప్పు చెడిపోయినట్లు గుర్తించారు. 

దాంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే క్యాంటిన్‌ కాంట్రాక్టర్‌ను పిలిపించారు. పప్పు వాసన చూడాలంటూ కాంట్రాక్టర్‌ను ఒత్తిడి చేశారు. ఇది ఎలా తినాలంటూ మండిపడ్డారు. సహనం కోల్పోయి కాంట్రాక్టర్‌ చెంప చెల్లుమనిపించారు. ముఖంపై గట్టిగా కొట్టారు. దెబ్బల తీవ్రతకు కాంట్రాక్టర్‌ ఒక్కసారిగా కింద పడిపోయారు. పైకి లేచేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే మళ్లీ మళ్లీ దాడి చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

శివసేన స్టైల్‌ ఇదే 
ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ అనుచిత ప్రవర్తన పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు సైతం మండిపడ్డాయి. ఇలాంటి ఘటనలు ఎమ్మెల్యేల ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఫడ్నవీస్‌ అన్నారు. హింసను తాను సమర్థించబోనని ఏక్‌నాథ్‌ షిండే చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు. 

ఇతరులను అకారణంగా కొట్టడం సరైంది కాదన్నారు. మరోవైపు తన వ్యవహార శైలిని ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ సమర్థించుకున్నారు. శివసేన స్టైల్‌ ఇదేనని తేల్చిచెప్పారు. క్యాంటిన్‌లో ఆహారం నాణ్యంగా లేదని చాలాసార్లు ఫిర్యాదు చేశానని, ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. తన ఫిర్యాదును లెక్కచేయనప్పుడు ఇంకేం చేయాలి? చచ్చిపోవాలా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌ను కొట్టడం పట్ల తానేమీ విచారించడం లేదన్నారు. సంజయ్‌ గైక్వాడ్‌ వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరుగాంచారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)