Breaking News

స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరు

Published on Sun, 01/12/2025 - 06:21

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ)లో లుకలుకలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కూటమి నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంవీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ శివసేన(ఉద్ధవ్‌) సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. 

ఉమ్మడిగా ఉండి పోటీ చేస్తే కూటమి భాగస్వామ్య పక్షాల కార్యకర్తలకు అవకాశాలు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో సంస్థాగతంగా బలోపేతం అవ్వాల్సిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించామన్నారు. ముంబై, థానె, నాగ్‌పూర్‌ తదితర మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సైతం సొంతంగానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే సానుకూలంగా ఉన్నట్లు రౌత్‌ వివరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి, మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) రూపంలోని మైత్రి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమని రౌత్‌ స్పష్టం చేశారు.  

కాంగ్రెస్‌ తీరు సరికాదు 
ఎంవీఏ, ఇండియా కూటమిలోనీ ముఖ్య భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌ పార్టీ సభ్య పార్టిలకు ఏమాత్రం సహకరించడం లేదని రౌత్‌ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ నేత విజయ్‌ వడెట్టివార్‌ భాగస్వామ్య పక్షాలను నిందిస్తున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం, సర్దుకుపోవడం వంటి వాటిపై విశ్వాసం లేని వారికి కూటమిలో కొనసాగే అర్హత లేదని రౌత్‌ విమర్శించారు. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే..లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క దఫా కూడా సమావేశం కాలేకపోయిందన్నారు. ఇండియా కూటమికి కన్వినర్‌ను కూడా నియమించుకోలేకపోవడం మంచి విషయం కాదన్నారు.      

ఎవరికీ మంచిది కాదు: ఎన్‌సీపీ(శరద్‌) 
శివసేన (ఉద్ధవ్‌) పార్టీ నిర్ణయంపై ఎంవీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్‌సీపీ(శరద్‌) స్పందించింది. ‘ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అది శివసేన(ఉద్ధవ్‌) పార్టీ ఇష్టం. మేం అడ్డుకోబోం. బలవంతంగా ఎవరినీ కలుపుకోం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మేం కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సరైన నిర్ణయంగా మేం భావించడం లేదు. కానీ, ఈ నిర్ణయం ప్రభావం ఎంవీఏ కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాల గెలుపు అవకాశాలపైనా పడుతుంది’అని ఆ పార్టీ నేత జితేంద్ర ఔహద్‌ చెప్పారు. 

మేం పట్టించుకోం: సీఎం ఫడ్నవీస్‌ 
స్థానిక ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేయాలన్న శివసేన(ఉద్ధవ్‌) నిర్ణయాన్ని బీజేపీకి చెందిన సీఎం ఫడ్నవీస్‌ తోసిపుచ్చారు. ‘ఎంవీఏ కూటమి పోటీలో ఉన్నా లేకున్నా మేం పట్టించుకునేది లేదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు మాకే మద్దతుగా ఉంటారనే నమ్మకం మాకుంది’అని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో శివసేన(ఉద్ధవ్‌) వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ..రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చునంటూ వ్యాఖ్యానించారు. 
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)