Breaking News

డిప్యూటీ సీఎం షిండేకు షాకిచ్చిన పైలట్‌

Published on Sat, 06/07/2025 - 12:43

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే  విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని జల్గావ్‌ నుంచి ముంబై వెళ్లేందుకు ఆయన విమానాశ్రయంలో దాదాపు గంటపాటు వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. షిండే వ్యక్తిగత విమానానికి చెందిన పైలట్‌ తన డ్యూటీ టైమ్‌ ముగిసిందని పేర్కొంటూ, విమానాన్ని నడిపేందుకు నిరాకరించారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే ముక్తాయ్ నగర్‌లో జరిగిన ఒక మతపరమైన ఊరేగింపులో పాల్గొన్న తరువాత జల్గావ్ నుంచి ముంబై బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. షిండేతోపాటు ఆయన ఆయన బృందం రాత్రి 9.15 గంటలకు జల్గావ్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే పైలట్ తన డ్యూటీ టైమ్‌ అయిపోయిందని చెబుతూ, విమానాన్ని నడిపేందుకు నిరాకరించారు. దీంతో కొందరు అధికారులు పైలట్‌ను ఒప్పించడానికి ప్రయత్నించారు.  45 నిముషాల తర్వాత పైలట్‌ విమానాన్ని నడిపేందుకు ఒప్పుకున్నాడు. దీంతో డిప్యూటీ సీఎం  ఏక్‌నాథ్‌ షిండే విమానం ముంబైకి బయలుదేరింది.

ఇది కూడా చదవండి: ఐదు దశల్లో ‘మహా’ మ్యాచ్‌ ఫిక్సింగ్‌: రాహుల్‌ సంచలన వ్యాసం

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)