Breaking News

అది కుట్ర ప్రకారం జరిగింది.. షేక్‌ హసీనా

Published on Wed, 08/05/2026 - 18:59

బంగ్లాలో జరిగింది శాంతియుత విద్యార్థి ఉద్యమం కాదని ఆ విషయంలో విద్యార్థులతో చర్చలు జరపాలనుకుంటున్నామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. నిరసనల పేరుతో ఉగ్రవాదులు క్రిమినల్స్‌ రిలీజ్‌ అయ్యారని ఇదంతా ప్లాన్‌ ప్రకారం చేసిన కుట్రని ఆరోపిస్తూ వాయిస్ మెసేజ్ రిలీజ్ చేశారు. ఇది తాము నిర్మించిన బంగ్లాదేశ్‌ కాదని తాను మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళతానని తన దేశాన్ని పునర్నిర్మిస్తానని పేర్కొన్నారు. 

కాగా గత కొద్ది సంవత్సరాలుగా  దేశం విడిచి భారత్‌లో ఉంటున్న ఆమె.. ఈ రోజు (బుధవారం)  ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రసంగించనున్నట్లు ప్రకటించారు. ఈ  నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీనా ప్రసంగాన్ని ప్రసారం చేయడం, ప్రచురించడం చట్టవిరుద్ధమని దేశీయ మీడియాను హెచ్చరించింది.

2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. 2025లో నిరసనల అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో బంగ్లాదేశ్‌ ట్రిబ్యునల్‌ ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా చట్టబద్ధం కాదంటూ కొట్టిపారేశారు.

ఈ నేపథ్యంలో.. తాను స్వదేశం విడిచి రెండేళ్లయిన సందర్భంగా ఢిల్లీలోని ఫారిన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సౌత్‌ ఏషియా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె వీడియో లింక్‌ ద్వారా ప్రసంగించనున్నారు. తన కుమారుడు సజీబ్‌ వాజెద్‌ జాయ్‌తో పాటు ఇతర వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హసీనా ప్రధానంగా ఏ అంశాలపై మాట్లాడతారన్న వివరాలు వెల్లడికాలేదు.

అయితే హసీనా ప్రసంగంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ఆడియో, వీడియో సందేశాలను ప్రసారం చేయడంపై గతంలో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ విధించిన నిషేధాన్ని గుర్తుచేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మీడియాను హెచ్చరించింది.

మరోవైపు హసీనా వర్గం మాత్రం ప్రభుత్వ వైఖరిని ఖండించింది. దేశ సరిహద్దులు దాటి కూడా భిన్నాభిప్రాయాలను అణచివేయలేరని వ్యాఖ్యానించింది. హసీనా, ఆమె పార్టీ నేతలు డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటారని గతంలో ప్రకటించారు.

ఈ పరిణామాలపై భారత్‌ స్పందిస్తూ.. ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమమని స్పష్టం చేసింది. ఇందులో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రమేయం లేదని, అక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలకు తాము బాధ్యత వహించబోమని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)